పుట:Maharshula-Charitralu.firstpart.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గౌతమ మహర్షి

95


యాశ్చర్యపడి “మహాత్మా! ఇంతవఱకు నాతో నున్న నీ విట్లు రెండు రూపము లేల తాల్చితి"వని ప్రశ్నించెను. ఇంద్రుఁడు వణఁకి పోయి పిల్లియై బయటకుఁ బోఁజూచెను. గౌతమమహర్షి యా పిల్లినిజూచి " ఓరీ! నీ విషయమును ద్వరలోఁ జెప్పనిచో దగ్దమై పోదు" వనెను. ఇంద్రుఁడు స్వరూపమును ధరించి . తన యహల్యా పేక్షను క్షమింపు మని కాళ్ళ పైఁ బడెను. అహల్య యాశ్చర్యభరితయై "మహాత్మా ! ఈ మోసము నే నెఱుఁగను. నీవు తిరిగి వచ్చి నా తనుసౌఖ్య మపేక్షించితి వని యెంచి తీర్ప నెంచితిని. ఇంతకు మించి పంచభూతములు తోడుగా నే నొం డెఱుఁగ" నని శపథము చేసెను. వెంటనే యాకాశవాణి యహల్య నిర్దోషిణి యని పల్కెను. గౌతమమహర్షి - యూరకుండక “నీ వెఱిఁగి చేసినను నెఱుఁగక చేసినను దోషము దోషమే. అజ్ఞానముననైన నగ్ని సంస్పర్శనమున హస్తము కాలకుండునా ! కావున, నీవు చైతన్యహీనమగు శిలవై పడియుండు" మని శపించి యింద్రునిఁ జూచి “దుర్మార్గా! దేవేంద్రా ! శచీపతి వయ్యు నీ కామలాలసతకు మితిమేరలు లేకుండఁ బ్రవర్తించితివి. అగ్ని హోత్రముతో నపహాసముచేయు తుంటరిమిడుత వై తివి. ఓరీ! నీచా ! మహాపతివ్రత యగు మహర్షి పత్నిని మోసగించి పరమహేయ మగు పనికిఁ బాల్పడితివి. కావున, నీయండము లూడిపడిపోవుఁగాక ! నీ శరీర మంతయు యోనిమయమై నీకు నిత్యఖేద మొదవించును గాక ! నీ సామ్రాజ్యము శత్రువు లపహరింప నీవు పదభ్రష్టత నంది దైన్యజీవనముఁ గడుపుదువు గాక !" యని తీవ్రముగా శపించెను. వెంటనే యహల్యా సంక్రందను రిరువురు నాతని పాదములపైఁ బడి శాప విముక్తి ననుగ్రహింప వేఁడుకొనిరి. గౌతమమహర్షి కొంత సరికిఁ గటాక్షించి యహల్యవైపు చూచి, “పాపాత్మురాలా! నీవు శిలవై శీతవాతాతపంబులకోర్చి నిరాహారవై రాత్రిందివములు రామస్మరణ పూర్వకముగా సహస్రాధికవర్షములు తపింపుము. ఈ .....................................................................................................................................................