పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునైదవ ప్రకరణము.

75



యుపనిషత్తెవరు చదువుదురో వారికాశ్రాద్ధ ఫల మనం తమని కఠోపని షత్తునందు వ్రావాయ బడియున్నది. నాడింకేమియు జరుగ లేదు. జ్ఞాతులు, కుటుంబబంధువులు, స్నేహితులు నందరు భోజనము చేసి ఎక్కడనుండి వచ్చిన వారక్కడకు వెళ్ళిపోయిరి. మరునాటి విందునకు జ్ఞాతులు కుటుంబీకులు యెవ్వరును రాలేదు, వాదందరును నన్ను త్యజించిరి. నామేనమామ, బావమరదులు, నలుగురత్తలు మాతము నాపక్షముననుండిరి.వారందరును వేర్వేరు గృహములలో నుండిరి. కావున తక్కినవారు నన్ను వెలివేయ లేకుండిరి.


నేను గిరీంద్ర నాధునితో, “నీవు శ్రాద్ధము పెట్టినందువల్ల నీ కేమి లాభము కలిగెను? ఎవ్వరు దానిని స్వీకరింప లేదుగ దా! నీ ప్రతిజ్ఞ మత్రము భంగమయ్యెను. ఎవరిని సంతోష పెట్టుటకు నీవు నీధర్మమునకు విరుద్ధమైన కార్యము చేసితివో వారే భోజనమునకు రాలేదే? ” అని యడిగితిని, ప్రసన్నకుమార ఠాకూర్, "దేవేంద్రుడింకెన్నడును అట్లు చేయనిచో మేమందరమును భోజనమునకు వత్తు” మని వర్తమానమంపెను. “అత్తైనచో ఇంత గడబిడ యెందుకు చేసియుందును? 'నేనింక విగ్రహారాధనలో మిళితము కాజాలను” అని ప్రత్యుత్తర మిచ్చితిని. బాహ్మధర్మానురోధముగ విగ్రహారాధన పరిత్యజించిన శ్రద్ధానుష్టాన మున కిదియే 'మొదటి దృష్టాంతము. బంధువులు, మిత్రులు నన్ను పరి త్యజించిరి. ఈశ్వరుడు నన్ను మరింత దగ్గరకు లాగుకొనెను. ధర్మమే జయమందెనుగదా యని నాయత్మసంతుష్టి, చెందెను. ఇదితప్ప నాకేమియు నక్కర లేదు.