పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

మహర్షి దేవేంద్రనాథఠాకూర్ స్వీయచరిత్రము.


మంత్రము స్థిరపరచి దానోత్సర్గ సమయమందీ మంత్రము నాచే చదివింపుమని శ్యామచరణభట్టాచార్యునితో చెప్పియుంచితిని. ఇక నావలపక్షమున పురోహితులు, ఆత్మీయ స్వజనులకో సాలమధ్యస్థ మున సాలగ్రామాదులస్థాపన జేసి నాయుప వేశనకొరక పేక్షించు చుండిరి. ఏపంకజూచినను కోలాహలము. నలుప్రక్కల తొడతోక్కిడి. ఇట్టియవసరమున నేను శ్యామచరణభట్టాచార్యుని మెకమూలకు తీసి కొని వెళ్ళి యానిర్దిష్ట మంత్రము ద్వారా దానసామాగ్రి నుత్సర్గము చేయ నారంభించితిని. ఈ విధముగా రెండుమూడు దానము లిచ్చుట యయ్యె ను. ఇంతలో నా మేనమామ మదన- బాబువచ్చి, “మీరిక్కడేమి చేయు చున్నారు? అటుపక్క దానము లిచ్చుచున్నారే. ఇచ్చట సొలగ్రామము లేదు పురోహితులు లేరు, ఏమిూ లేదు” అని కేకలు పెట్టెను. మరియొక చోటునుండి మరియొక గోల, “అయ్యో కీర్తన పాటకులను లోనికి రాని చ్చుట లేదు”, అని యందరు కేకలు పెట్టిరి. నీలరత్న హాల్టార్ , “అయ్యో, యజమానికి కీర్తనవినుట మిక్కిలి యిష్టముగా నుండెను,” అనెను. నా పినతండ్రి రామనాధశాకూర్' వచ్చి "కీర్తనపాటకులు రాకుండ నాటం కపరచితి వేల?” అని యడిగెను. నాక దేమియు తెలియదనియు, నేనడ్డు పెట్ట లేదనియు జెప్పితిని. “అదిగో చూడు, హజారీలాల్' పాటకుల నింటి లోనికి ప్రవేశింపనిచ్చుట లేదు,” అనెను. నేను త్వరితముగా పోడశ దా నములును, తదితర దాన సామాగ్రుల నుత్సర్గము కావించి మూడవ యంతస్థులో నాగది లోనికి వెళ్ళిపోతిని.


అటుపిమ్మట నా కెవ్వరును కనబడ లేదు. గిరింద నాధుడు శ్రాద్ధము పెట్టుచుండెనని మాత్రము వింటిని, మధ్యాహ్నా నంతరమున నీకో లాహలమంతయు సద్దుకొనిన పిమ్మట శ్యామచరణ భట్టాచార్యుని మరి కొందరు బాహ్ములను చలువ రాళ్ళు పరుపబడిన నాక్రింది గదిలోనికి తీసికొని వెళ్ళి కఠోపనిషత్తు చదివితిని. ఏలనన శాద్ధ సమయము నందా