పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునైదవ ప్రకరణము

78


బడియుం డెను. పరిశుభ్రముగను, స్వచ్ఛముగసు యున్న ఆ వీథులలో నొక్క మనుష్యుడై నను కనబడ లేదు. కోలాహలమును లేదు. సర్వమును ప్రశాంతముగ నుండెను నామార్గదర్శి వీధి పక్కనున్న ఒకయింటిలో ప్రవేశించి దాని మేడలోని కెక్కెను. "నేనును అతని వెంటనే యెక్కితీని, అదొక దివ్యమైన గృహము, లోపల తెల్ల చలువ రాతితో చేయబడిన యనేక మైన 'మేజాలు, కుర్చీలు. అతడు నన్ను కూర్చుండు మనెను. నేనొక కుర్చిలో కూర్చుంటిని. ఇంతలో నా ఛాయ అదృశ్యమయ్యెను. అక్కడ నింకెవ్వరును లేరు. నిశ్శబ్దముగానున్న యాగదిలో నేను నిశ్శ జముగా కూర్చుంటిని. ఒక క్షణమైన పిమ్మట గదిముందున్న ద్వారము యొక్క తెర యొకటి ఒత్తి గింపబడెను. ఆసీనురాలయ్యెను నాజనని! మర ఇదినముననామె కేశ జాల మెట్లు విరగపోసి యుండెనో యిప్పుడునట్లే విరగ పోసియుండెను. ఆమె మరణించినప్పుడు నిజముగా మరణించెనని నేన నుకోన లేదు. ఆమెకు అంత్యక్రియలు జరిపి స్మశాన వాటిక నుండి యిం టికి వచ్చిన పిమ్మటకూడ ఆమె మరణించినదని నమ్మజాల నైతిని. ఇంకను జీవించి యున్నదనే నిశ్చయించికొంటిని. సజీవమైన నాతల్లి నిప్పుడు నా సమ్ముఖమున చూచితిని. “నిన్ను చూడవలెనని యిచ్ఛజనించెను. నీకొ రకు కబురుపంపితిని. నీవు నిజమైన బ్రహ్మజ్ఞాని వైతివిగా ! కులం పవిత్రం జననీ కృతార్ధం!” అనెను. ఆమెను చూచి యామె యొక్క యీమధుర వాక్యమును విన్న పిమ్మట ఆనందముచే నానిద్ర భంగమయ్యెను. అప్పటి కింకను నాపక్క మీదనే దొర్లుచుంటిని.


శ్రాద్ధ దినము నచ్చినది. గృహ సమ్ముఖమున పశ్చిమ ప్రాంగణమున నొక దీర్ఘమైన పందిరి వేయబడియుండెను. దానములిచ్చు సమయ మందివ్వవలసియున్న బంగారువస్తువులచే నాపందిరి యలంకరింపబడి యుండెను. క్రమముగా నాసాలయంతయు కుటుంబ స్నేహ బాంధవ జనముతో కిక్కిరిసిపోయెను. విగ్రహారాధన సంస్రవవిసర్జితమైన యొక