పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.

పదునారవ ప్రకరణము



మతండ్రిగారు ప్రధమమున 1841 వ సంవత్సరములో ఐరోపొను సందర్శించిరి. హుగ్లీ, పాబ్నా, రాజుషాహి, కటకము, మేదినీ పురము, రంగ పురము, త్రిపుర మొదలగు జిల్లాల యందప్పుడాయనకు గొప్పజమీందారి భూములుండెను. నీలిమంచు కర్మాగారము లోను, బొగ్గు గనులలోను, సూర్యాకారము, చక్కెర, తేయాకు వాణిజ్యములోను ఆయనకు విస్తార వ్యాపార ముండెను.వీనితో బాటు రాణిగంజి బొగ్గు గనులలో కూడ పనిసాగించుచుండిరి.అప్పుడు మాసంపద ఉచ్ఛదశ యందుండెనుసకల మహాకార్యముల భారము మా చేతిలో పడిన యెడల వానినిరక్షింప లేమని తన సుతీక్ష్న బుద్ధితో నాయన కనుగొనెను. మాహస్తములలో పడి వాజ్య వ్యవసాయ కార్యములన్నియు పతనము చెందినచో వానితో బాటు మాస్వార్జితమైన గొప్ప గొప్ప జమీందారీలు విలుప్తముగుటయే గాక మా పూర్వులు సంపాదించిన బరహింపూరు,కటక్ జమీందారీలకు కూడ నాదశ యేపట్టను. తన వాణిజ్య వ్యాపారము చెడుటవల్ల మా పూర్వుల ఆస్తి కూడ నశించి పోవును. ఇది ఆయనమనస్సున కతిశయచింతా విషయమై యుండెను. కావున 1840 సంవతృరములో, ఐరోపాకు పోకమునుపు తన పూర్వులు సంపాదించిన బరహీంపూర్ , కటక్ జమీందారీలతో - స్వార్జితమైన డిహిష జడ్ పూర్ , పర్గణా కాశీ గ్రామములను చేర్చి, ఈ నాలుగు " ఇస్లేట్లకు ' నొక " ట్రస్టుడీడ్ " వ్రాసి ముగ్గురు 'టస్టీలను' నియమించిరి. ఈ సమస్తమునకుసధికారులు వారే. మేము కేవలముప సత్వ భోగులముగ నుంటిమి.దీనింబట్టి ఆయనకు మాయందుండు ప్రేమయు, సూక్ష్మమైన తనదూరదృష్టియు కూడ స్పష్ట పడెను,