పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాల్గవ ప్రకరణము.

67


సూర్యాస్తమయమగు సరికి 'చంద్రనగరము' చేరితిమి. అప్పటికి తెడ్లు వేయువాండ్రు చేతులు తిమ్మెర లెక్కెను. అవిశ్రాంతముగ యింత పరి శ్రమ చెందియుంటచే నింక పనిచేయ లేక పోయిరి. నదికి పోటుకూడ తగిలెను. ఇది విషమవ్యాఘాతము. అక్కడనుండి “పొలా' చేరుటకు రాత్రి ఎనిమిది గంటలాయెను. ఇక్కడ పడవ ఒక వైపున కొరగజొచ్చెను. ఉదయ ము 10 గంటలు మొదలు సాయంతము వరకు వదలక వర్ష ముకురియు చుండెను. ఎక్కువగాలి విసురుచే పడవ కూడ ఒకటి రెండు సార్లు ఆపవ లసివచ్చెను. పడవవాండు తడిసి చలిచే వణకుచుండిరి. ' పొలా' చేర గనే పడవ ఒడ్డునుండి యొకడు వచ్చి బండి సిద్ధముగా నున్నదని చెప్పెను. ఇది వినినతోడనే అడుగంటిన నాప్రాణములు ఉట్టి పడి లేచివచ్చినవి. అంతవరకు కదలక మెదలక పడవలోనే కూర్చుంటిని. బండిమాట వినిన తోడనే బయటగది తలుపువద్ద నిలువబడితిని. అచ్చట మోకాలిలోతు నీళ్లుండెను. నీళ్ళు పడవలోనికి వచ్చి అడుగు పైగా నిలచి యుండెను. ఆ దంతయు వర్షపునీరు. ఇదివరకు నాకీ సంగతి తెలియదు. “ పొల్టా' వద్దకు బండి రాకుండినచో, కలకత్తాకు తిన్నగా పడవమీద నే వెళ్ళియుడినచో, నీటి బరువుతో నిశ్చయముగా పడవ మునిగియుం డెడిది. ఈకథ చెప్పుట

'కెవ్వరును జీవించి యుండక పోయి యుందురు.


పడవదిగి బండెక్కెతిమి. రోడ్లనిండ నీరు నిలచియుండెను.బండి చక్రములు సగమువరకు నీటిలో దిగబడిపోయెను, మిక్కిలికష్టముమీద 'రాత్రి రెండు జాముల వేళ యిల్లు చేరితిమి, అందరు నిద్రించుచుండిరి. ఎవ్వరు కదలుట లేదు. నాభార్యాబిడ్డలను లోపలిగదులలోనికి పంపి నేను మూడవ అంతస్థునకు వెళ్ళితిని. అక్కడ మా జ్యేష్ఠ పితామహుని పుత్రుడగు వ్రజ బాబు నాకు స్వాగత మిచ్చెను. అంతరాత్రి వరకు ఒక్కడు నాకొరకు మేల్కొని అపేక్షించుచుండుట చూడ నామనసున కొక భయము జనించెను. ఎందువల్లనో తెలియదు,