పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

మహర్షి దేవేంద్రనాథ ఠాకూర్ స్వీయచరిత్రము,

పదునైదవ ప్రకరణము.




మాతండ్రిగారు 1846 న సం|| శ్రావణ మాసములో సీమయందు మరణించిరి. అప్పటి కాయన వయస్సు 51 సంవత్సరములు.అవసాన సమయమునం దాయన వద్ద నాకనిష్ఠ సోదరుడు నగేంద్రనాధుడును, నా బావ మరిది నవీన చంద్ర ముఖర్జీ యును యుండిరి. మాకీవర్తమానము భాధ్రపద మాసములో చేరినది. 'భాదపద బహుళచతుర్దశినాడు దర్భగడ్డితో నాయన విగ్రహము నిర్మించి నామధ్యమ బ్రాతతో గంగానది అవతల దరికి బోయి ఆ విగ్రహమునకు దహనక్రియలు జరిపితిమి. నాడు మొదలు యధారీతిగ పది దినముల వరకుమైలపట్టి హవీస్యాన్నమే భుజించితిమి. ఈపది దినములు శిష్టాచారరక్షణ నిమిత్తము ఉదయముననే లేచి మిట్ట మధ్యాహ్నము వరకుకాలికి జోడు లేకుండ కలకత్తాలో నున్న మాన్యులను చూచి సాయంకాలము వరకు వీరిని మాయింటివద్దపితృవియో గానంతరమున పుతులు పాలింప వలసిన కఠోర సియమములన్ని యు యధావిధిగ జరిపితిమి. మాపినతండ్రి రామనాధ ఠాకూర్ , “చూడు,ఇప్పుడేమి • బహ్మ, బ్రహ్మ ' యనుచు గోల చెయ్యకు సుమా! పెద్దన్నయ్య పేరు చాల ప్రసిద్ధి కెక్కినది. " అని భయము చెప్పెను.


రాజా రాధాకాంత దేప్ వద్దకు నేను వెళ్ళినప్పుడు మాతండ్రిగారిని గురించి అనేక సంగతులడిగి ఆయన మృత్యువును గురించితమ ఆంతరిక దుఃఖమును తెలియ జేసెను. నాయందాయనకు చాల యిష్టము. అందుచే మిత్రుని వలె, “శాస్త్రము ములలో నేయేవిధానములు చెప్పబడియున్నవో వాని ననుసరించి యీశాద్ధమును విశుద్ధ భావముతో జరుపుమీ ” యని నాకు సలప, చెప్పెను. " నేను "బ్రాహ్మ" ధర్మ దీక్షను స్వీకరించితిని. దానికి వ్యతి రేకముగా సే కార్యమును నాదరించు చుంటిని.