పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

మహర్షి దేవేంద్రనాధరాకూర్ స్వీయచరిత్రము.



దయినది. అనేకులు మిమ్ము వెదకుటకు పడవలు వేసికొని బయలు దేరి నారు. ఇంతవర కెవ్వరును మిమ్ము కలసికొన లేక పోయిరి. నాకష్టము మాత్రము ఫలించినది. మిమ్ములను చేరగలిగితిని,” అని అతడు చెప్పే ను, ఈవార్త నాపై పిడుగువలె పడెను. సబ్దుడనై , విషజ్ఞుడనై , డింగీ వైపునకు నాపడవను నడుపుకొని వెళ్ళి డింగీ నెక్కి దీపము వెలుగున ఉత్తరము స్పష్టముగా చదివితిని. ఇప్పుడు చేయునదే మున్నది? అప్పుడీ మరణవార్త నేనెవ్వరితోను చెప్పలేదు.


మరునాడుదయమున పెందలకడనే కలకతా నైపునకు మరలితిసి. నాపడవకు 14 తెడ్లుం డెను. లోనిచక్కలకు బల్లలు దిగగొట్టి తివాసు లు పరుపబడెను. నాభార్యాబిడ్డల సందులోనికి గోనిపోతిని. డింగీ రాజనారాయణ బాబున కిచ్చి సావకాశముగ రమ్మంటిని. తెడ్లలోను తెరచాపతోను నడుపబడి భాద్ర పదమాస గంగా ప్రవాహ సహాయ మున, వ్రాలెడు నక్షత్రముల వేగముతో పడవ పరుగిడుచుండెను. కాని నామనసంతకన్న వేగముగ నడచు చుండెను. మేఘావృతమైన ఆకాశమునందనవరతము వర్షము చేతను, వాయువు చేతను కోలాహ లమగు చుండెను. ఆ కాల్నా' కొలదీ కాలమునకు చేరు ముమనగా మధ్య దారిలో నొక మైదానము చెంత నొక పెద్ద తుపాను బయలు దేరి పడవను ముంచివేయుటకు సిద్దమైనది. అప్పుడు పడవ ఒడ్డు చేరువనుండి పోవు చుండెను. తకుణమే పడవ వాండు దుమికి దగ్గరనున్న యొక చెట్టు మోడునకు పడవనుకట్టి పెట్టిరి. కావున పడవ సురక్షితముగానుండెను. అప్పటి కామోడే ఆ నిరాశ్రయ ప్రదేశ మందు మాకాశ్రయమును, పరమమిత్రమును అయ్యెను. అయిదునిమిషముల పిమ్మట తిరిగి మనో వేగముతో పడవ బయలు దేరెను.


పొద్దుగుంకు సమయమున, నీల మేఘములచాటున వెల వెల బోవుచున్న సూర్యుని చూచితిని. అప్పుడు 'సుఖసాగరము' చేరితిని,