పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

మహర్షి దేవేంద్రనాధశాకూర్ స్వీయచరిత్రము.


విగ్రహారాధన యొక్క అట్టహాసమును, ఆడంబరమును అంతయు కంతములలోను పురాణములలోనే. వేదాంతమునందు దాని కేమియు గౌరవము లేదు; కావున అందరును తంత్రములను పురాణములను పరి త్యజించి ఉపనిషత్తుల నవలంబించినచో, ఉపనిషత్తులలోని బ్రాహ్మవి ద్యను పార్జించి బహ్మూపాసనా నిరతులైనచో, భారతవర్ష మున కశేష మాంగళ్యము లభించును.


ఈమంగళ పధమునకు మార్గదర్శి నగుటయే నాయుద్దేశము. కాని ఏవేదములకు ఉపనిషత్తులు భాగములుగానున్నవో, ఏ వేదముల సిద్ధాంతములను చూపుటకు • వేదాంతదర్శనము, శ్రమపడినదో, ఆ వేద ము లేమియు మనము నేర్చికొన లేకున్నాము. రామమోహన రాయల ఏర్పాటును బట్టి కొన్ని యుపనిషత్తులు ప్రచురిం పబడెను. ఇదివరకచ్చు లో లేనివి కొన్నింటిని నేను సమకూర్చితిని. కాని వేదాంత వృత్తాంత మునుగూర్చి విశేషము మన కేమియు తెలియదాయె. బంగాళా దేశ మందు వేదములు నశించియే పోయినవి, న్యాయశాస్త్రములును, స్మృ తులును ప్రతి సంస్కృత పాఠశాలయందును నేర్పుచుండిరి. వానినుండి న్యాయవాగీశులు, స్మార్త నాగీశులు అనేకులు వెలువడు చుండిరి. కాని అక్కడ 'వేదముల నామముగాని వాసనగాని ఎంత మాత్రము లేకుండెను. "వేదాధ్యయనము, అధ్యాపనము అను బ్రాహ్మణ ధర్మములు ఈ దేశమునుండి అంతరించి పోయెను. కేవలము వేదవిరహీత నామ మాత్ర ఉపవీత ధారులగు బ్రాహ్మణులు మాత్రమున్నారు. ఎవరో ఒకరిద్దరు పండితులుతప్ప తక్కిన బాహ్మణులు వారినిత్యకర్మ సంధ్యా వందనము యొక్క అర్ధము సహితమెరుగరు.


వేదములు క్షుణ్ణముగా నేర్చికొనవలెనని నాకొకయాశ పుట్టినది " వేదవిద్యకు ముఖ్య స్థానము వారణాసి. కావున నచ్చట వేదము నేర్చు కొనుటకు విద్యార్థులను బంప సమకట్టితిని. 1844 వ సంవత్సరములో