పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాల్గవ ప్రకరణము.

61


కాశికొక విద్యార్థిని పంపితిని. అతడు వేదముల నాతపుస్తకముల మూలములను సంగ్రహించి శిక్షనభ్యసింప నారంభించెను. మరుసటి సంవత్సరము మరిముగ్గురను పంపితిని ఆనంద చంద్రుడు, తారక నాధుడు, వాణీశ్వరుడు, రామనాధుడు.. ఈ నలుగురు విద్యార్థులు వెళ్లిరి.


వీరిని కాశికి పంపినపుడు మాతండ్రి ఇంగ్లండు నందుండెను.ఆయన యొక్క విస్తీర్ణ కార్య భారమంతయు నా పైబడెను. కాని నేనేకార్యము సరిగా చూడ లేక పోయెడి వాడను. నాకింది. యుద్యోగస్థు లేపనినంతయు జరపుచుండిరి. నేను కేవలము వేదము, వేదాంతము, ధర్మము, ఈశ్వరుడు, జీవిత పరమావధి వీనియం దేనిమగ్నుడనై యుంటిని. ఇంటివద్ద స్థిమితముగా కూర్చుండుకుటకు సహితము నాకు వీలులేకుం డెను. వ్యావహారిక చింతనలతో అంతకంతకు నాయుదాసీన భావమభివృద్ధి చెంద చుండెను. ఇంత ఐశ్వర్యమునకు ప్రభువునగుటకు నాకిచ్ఛవొడమద దాయెను. సర్వమును త్యజించి ఒంటరిగా తిరుగవలెనను కోరిక యే నాహృదయమునందు రాజ్యము చేయుచుండెను. ఈశ్వరుని ప్రేమలో మగ్నుడనై : ఏకాకినై ఎట్లు నిర్జనమునందు సంచరించు వాడనో ఎవ్వరును తెలిసికొనజాలరు. జలమునందును, స్థలమునందును ఆతని మహిమ ప్రత్యక్షముగ వీక్షించుచుందును. వివిధ దేశములందును ఆతని కరుణను గొంతును. విదేశములయందును, విపత్తులయందును, సంకటములందును ఆతని పరిపాలనామ భావమునే గాంచుచుందును. ఈయుత్సాహముతో నేనింక నింటి వద్ద నుండ లేక పోతిని.


1848 వ సంవత్సరము శ్రావణమాసపు ఘోరవర్షమునందుగంగానది మీద విహారమునకు బయలు దేరితిని. నాప్రియపత్ని అశ్రువులగార్చుచు నావద్దకువచ్చి, “నన్ను వదలి ఎక్కడికి వెళ్ళెదరు. మీరువెళ్ళుట తప్పని సరియైనచో సన్నును తీసికొనిపొండు” అనెను. కావున