పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాల్గవ ప్రకరణము,

59



పొయలు కూడెను. అప్పుడు మా పరిశ్రమ ఫలించెనుగదా యని సంత సించితిమి. ఈ సభకు పర్యవసానముగా " హిందూ హితార్ధి'యను ఒక విద్యాలయము స్థాపింపబడి, తత్కార్యనిర్వహణముకొరకు రాజా రాధాకాంత దేవ్ బహద్దూర్ అధ్యక్షుడుగా నియమిం పబడెను. హరి మోహన సేను, 'నేను కార్యదర్శులమైతిమి. ఈయుచిత విద్యాలయము లో భూ దేవముఖోపాధ్యాయుని ప్రథమ ఉపాధ్యాయునిగా నియమిం చితిమి. నాటినుండియు దేశమున క్రైస్తవమత స్వీకరణ ప్రవాహము ముదగింపనారంభించెను. క్రైస్తవప్ర చారకుల మస్తకముల పై కుఠా రాఘాతము పడెను.

సుకునాల్గన ప్రకరణము.


ఉపనిషత్తులనుండి బ్రహ్మజ్ఞానము పొంది బ్రహ్మోపాసనా విధానమును గాంచిన పిమ్మట, సముదయ భారతవర్షమునకు నీయుపనిషత్తులే ప్రామాణ్య శాస్త్రములు

గావున, ఉపనిషత్తుల ప్రచారము ద్వారా అహ్మధర్మప్రచారము గావింపవలెనని 

నాకు సంకల్ప ముండెను. సకలశాస్త్ర కారులు ఉపనిషత్తులనే వేదాంతముగ పరిగణింతురు వేదాంతమనగా సకల వేదముల యొక్క శిరోభాగము ; సకలవే దముల యొక్క సొరము. 'వేదాంత ప్రతిపాద్య బాహ్మధర్మము ప్రచారము చేయగలిగితినేని సముదయ భారతవర్షము యొక్క ధర్మముఏకమగును, పరస్పర విచ్ఛిన్న భావము లంతరించును, అందరును భాతృభావముతో మిళితమగుదురు. దేశము యొక్క పూర్వ విక్రమము,శక్తి, పునర్జన్మము మొందును; వేయేల, దేశములకు తన స్వతంత్రము తనకు మరల లభించును, అని ఇట్టి ఉచ్ఛత రాదర్శమపును నామనసు నందుండెను