పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదవ ప్రకరణము.

45


చున్నారు. ప్రతి బాహ్మునకును ఏకాంతముగా తన యాత్మను పర బ్రహ్మమున కర్పించుటకే వాక్యములు చాలును. కాని బాహ్మ సమాజమందు బ్రహ్మోపాసన చేయుటకింతకన్న నెక్కువ ప్రశస్తమైన యుపాసనా మంత్రము కావలసి యుండెను. ఈయభిప్రాయముతో ఉపనిషత్తులలో నుండి ఇకమూడు శ్లోకములను చేర్చితిని. అందు మొదటిది.


సపర్యాగచ్ఛుగక్రమకాయమవ్రణ మస్నా విరంశుద్ధమ పారవిద్ధం|
కవిర్మనీషి పరిభుః స్వయంభూర్యాద్వోత థ్యాతోర్దాన్ వ్యదధాచ్ఛాశ్వతభ్యః సమాభ్యః |"


"అతడు సర్వవ్యాపి, నిర్మలుడు, నిరాకారుడు, నిరంజనుడు, పరిశుద్ధుడు, పాపరహితుడు, అతడు సర్వదర్శి, మనోనియంత, సర్వ శ్రేష్టుడు, స్వప్రకాశుడు, సకలార్ధ ప్రదాత, 'సర్వవ్యాపియై, సర్వసాక్షియై, నిరాకారుడైన, ఈపర మేశ్వరుడే జగత్కర్త కూడను. గనుక ఉపాసనాసమయమునం దీవిషయము కూడ మననము చేయుటకీ కిందిశ్లోకము చేర్చబడెను.


" ఏతస్మాజాయ తే ప్రాణోమనః సర్వతైయాణిచ
ఖవాయుర్జోతి రాపః పృధివీవిశ్వస్య ధారి "


అనగా ఈయన నుండియే ప్రాణము, మనస్సు, ఇంద్రియ సముదాయము మరియు ఆకాశము, వాయువు కాంతిజలమునీటికన్నిటికీ ఆధారమైన ఈ పృథివియు, ఉత్పన్న మగుచున్నవి. ఈశ్వరుని శాసనమువల్ల నే జగత్సంసారమంతయు జరుగు చున్నది. ఈవిషయమును ధ్యానించుట కనుకూలముగ నుండుటకీ కింది శ్లోకమును చేర్చితిని :-


భయాదస్యాగ్ని స్తపతిసూర్య : భయా
దింద్రశ్చవాయుశ్చ మృత్యు ధావతి పంచమః "