పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

మహర్షి దేవేంద్రనాధశాకూర్ స్వీయచరిత్రము,



గాయత్రీ మంత్రము నేర్చుకొనుట కష్ట సాధ్యమైన పనిని, " మంత్రసాధ నమా, లేక మరణమా" అనగలిగి నంతటి దృఢమనస్కులకు దక్క. ఇది సులభ సాధ్యము కాదు. కాని అట్టి దృఢ ప్రతిజ్ఞయు, గాఢ విశ్వాసమును గలిగిన వారు బహు స్వల్పముగ నుండిరి. వెతికినచో వెయ్యి కొకరుండిరేమో. కాని నాకు కావలసిన దేమన జనసామాన్య మునకు సులభ సాధ్యమైన యుపొసన. కావున గాయత్రీ మంత్రము ద్వారా ఉపాసన చేయగలిగిన వారుండిన ఉందురుగాక. కాని అట్లు చేయ లేనివారు ఇక ఏ యితర సులభ మార్గమున నైన చేసిన చేయవ చ్చునని నిశ్చయించి కొంటిని. కావున దీక్ష" పత్రమునందు, “ ప్రతి దినమును శృద్ధతను ప్రీతి పూర్వకముగను, గాయత్రీ మంత్రము పది సొరులుచ్చరించి బాహ్మాపాసన అనుదినమును సలిపెదను” మాటలకు బదులు, " అనుదినమును శద్ధతోను, ప్రీతిపూర్వకము గను, నాయాత్మను పరబ్రహమునకు సమర్పించెదను. "అని మార్పుచేతిని. కాని ఈశ్వరుని సంభాషించుటకు మాటలే ప్రశస్తమైన యుపాయము అని ఎరుగుదును. ఆమాటలు ప్రాచీనములై, సహజ ములై, సుబోధకము లై, సులభగ్రాహ్యము లైనచో ఉపాసకునకు మ రింత బాగుగా ఉపయోగపడును. విశేష అను సంధానము మీదట, పైలక్షణములను కలిగి, ఉపాసన కనుకూలమగు ఈకింది. రెండు మహా వాక్యములను ఉపనిషత్తుల యందు గాంచి బ్రహ్మానంద భరితుడ నైతిని:-


"సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ”
ఆనందరూప మమృతంయద్వి భౌతి"

అని


ఈ పదములు నాయాశలను దీర్చి, నాప్రయత్నములను సఫలీ కృతములు చేసెను. ఏలయన ఇప్పుడు బ్రాహ్నలందరు " సత్యంజ్ఞా నమనంతం బ్రహ్మ " అను మాటల నుచ్చరించి బ్రహ్మోపాసన చేయు