పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

మహర్షి దేవేంద్రనాధశాకూర్ స్వీయచరిత్రము,


అనగా, "" ఈయన ఆజ్ఞవల్ల అగ్ని ప్రజ్వలితమగుచున్నది, ఈయన ఆజ్ఞవల్ల సూర్యుడు ఉత్తాపము నిచ్చుచున్నాడు. ఈయన ఆజ్ఞవల్ల నే మేఘము, వాయువు, మృత్యువుసంచారము చేయుచున్నవి.సకలమునకు ఆశ్రయుడును, ముక్తి దాతయు అగు పరమేశ్వరుని స్తోత్ర పాఠము గావించుటకు ఎంతో శోధనగావించి, తంత్ర ములనుండి ఈకింది శ్లోకములను చేర్చితిని.


“ ఓంనమస్తే సతీ తేజగత్కారణాయ, నమస్తేచి తే సర్వలోకాశ్రయాయ |
సమోద్వైత తత్వాయముక్తి ప్రదాయ, నమోబ్రహ్మణే వ్యాపినే శాశ్వతాయ!
త్వమేకం శరణ్యం, త్వమేకం వరేణ్యం, త్వమేకంజగత్పాలకం, స్వప్రకాశం ! త్వమేకంజగత్కర్త, పాత్ళు, పహర్తృ,త్వమేకంపరం,నిశ్చలం, నిర్వికల్పం!
భయానాంభయం, భీషణ భీషణానాం,గతిః ప్రాణినాం, పావనం పాపనానాం!
మహాచ్చైః పదానాణ నియ దృత్వమేకం, పరేషాంపరం, రక్షణం రక్షణానాం!! వయంత్వాంస్మరామో, వయం త్వాంభజామో,వయంత్వాంజగత్సాక్షి రూపంనమామః |
సదేకం, నిదానం, నిరాలమ్బ మీశం భవాంభోదిపోతం, శరణ్యంవ్రజామః:||


అనగా సత్య స్వరూపుడవును, జగత్తునకు కారణుడవును, జ్ఞానస్వరూపుడవును, సకలలోకములకును ఆశ్రయుడవును అయిన నీకు నమస్కారము. సమానాధి కాద్వితీయుడవును, ము క్తి ప్రదాతవును, సర్వవ్యాపివియు, నిత్యుడవును, బ్రహ్మమును, అగు నీకు నమస్కారము. నీ వొక్కడవే శరణ్యుడవు, నీవొక్కడవే శ్రేష్ఠుడవు, నీవొక్కడవే జగమును కాపాడువాడవు, స్వప్రకాశుడవు, నీవొక్కడవే జగత్తును సృష్టించి రక్షించుచు, ఇచ్చవచ్చిన దానిని వినాశము చేయుశక్తిగలవాడవు. నీవొక్కడవే అన్నిటికిని మీది పొడవు. నిశ్చలుడువు, వికల్పము లేనివాడవు !