పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

మహర్షి దేవేంద్రనాధశాకూర్ స్వీయచరిత్రము.


నొందవనుమాట నిజముగాదా ! గనుక విగ్రహారాధన బదులు ఏకేశ్వ రోపాసన నెలకొలుప బడుటకు, బాహ్మధర్మ స్వీకారము యధావిధిగా జరుగుట ఒక ముఖ్య కర్తవ్యమని ఎంచి బాహ్మధర్మ స్వీకారమునకు నేనొక ప్రతిజ్ఞ పత్రమును తయారు చేసితిని. దీని ప్రకారము, ప్రతిదిన మును గాయత్రీ ముత్రము ద్వారా బొహ్మోపాసన గావింపవలెనని యొక నియమమును ఏర్పాటు చేసితిని. గాయత్రి ద్వారా బాహ్మోపొ సన చేయ వలయునని రామమోహనుడు చెప్పియున్నాడు. ఈ సంగతి యే ఇప్పుడు నాకీనియమమును స్ఫురింప చేసెను. బ్ర హ్మోపసనా విధానము వలన నాకొక ఆశ బయలు దేరెను. “ఓంకార పూర్వికాస్తి' స్రోమహా వ్యాహృత యోహవ్యయాత్రి పదా చైవ సావిత్రీ విశ్లేయం బాహ్మణోముఖం.” ఓంకారముతో గూడిన “భూర్భువస్సువః” యను గాయత్రిలోని తక్కిన మూడు భాగములును బ్రహ్మ ప్రాప్తికి మూడు ద్వారములు. “ఓంకారము” తోడను, వ్యాహృతులతోడను,గాయత్రి మంత్రమును మూడు సంవత్సరములు ఏక దీక్షగా జపము చేసినచో బ్రహ్మను పొందవచ్చు నని నానమ్మకము. అందుచే నేసీ ప్రతిజ్ఞ పత్రములో, ఉదయముననే, ఏదియును భుజింపకముందు ఈఉపాపాసనను వ్రాసితిని.


1848 సంవత్సరమున పుష్య సప్తమి, అహ్మధర్మ స్వీకారమునకు స్థిరపరచితిమి. 'వేదములు చదువు గదికి తెరగట్టించితిని. సంబంధము లేనివారలు లోనికిరానీయవలదని యాజ్ఞాపించితిని. విద్యా వాగీశుడు వేదిక పై నాసీనుడై యుండెను. మేమందరమును చుట్టును కూర్చుంటిమి. మాహృదయములలో ఒక నూతనోత్సాహము జ్వలించుచుండెను. ఈదినమున మాహృదయములలో నాటబడు ఈ బాహ్మధర్మబీజము అంకురించి కాలక్రమమున అసంఖ్యాకములగు ఇతర వృక్షములకు మూలమై అనంత కాలమునిలచి యుండునుకదాయని నమ్మితిమి. అవి