పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము.

39


వాగీశునిచే పరీక్షింపబడిరి. వారిలో ఆనంద చంద్రుడును, 'తారకనా ధుడును, ఎన్ను కొన బడిరి. వారిద్దరియందును నాకు మిక్కిలి యిష్ట ము. ఆనందచంద్రునకు దీర్ఘములగు కేశములుండుటచే “సుకేశ " యను ముద్దు పేరుతో నతని పిలచువాడను.

తొమ్మిదవ ప్రకరణము.


బ్రావ్మాసమాజమునందు ధర్మజీవనములో కొకరికి స్నేహభావము లేదుగదా యని చింతించుచు నొకనాడు ముద్రాలయములో కూర్చుంటిని ప్రవాహమునందు పోటుపాటువలె జనమువచ్చుచు పోవుచుండిరి. గాని ఒక్క ధర్మసూత్రములో అందరును బంధింపబడి యుండ లేదు. కావున సమాజమున సభ్యులుగా నుండగోరువారి సంఖ్య ఎక్కువగుచున్న కొలది. అందులో కొందరిని మాతమే తీసికొనుట మంచిదని నాకు తోచినది. కొందరు యథార్థముగ ఉపాసనకొరకు వచ్చుచుండిరి. మరికొందరు, ఏయుద్దేశమును లేకయే వచ్చుచు పోవుచుండిరి. ఇందులో నిజమగు బ్రహ్మోపాసకులు ఎవరో గ్రహించుటెట్లు? ఇట్లు ఆలోచించి ఒక నిశ్చయమునకు వచ్చితిని. విగ్రహారాధనను త్యజించి, ఏకేశ్వరోపా సనావతులై, ఎవరు ప్రతి బద్ధులయ్యెదరో వారినిమాత్రము బ్రాహ్ములుగా భావింప నిశ్చయించితిని. ఉన్నది బ్రహ్మ సమాజము గావున సభ్యులుగా నుండు వారందరు బ్రాహ్ములుగా నుండుట అవసరము.


ఆరంభమున బ్రాహ్మసమాజము జయలు దేరినది బ్రాహ్ములు నలుగురు చేరగా అని అనేకులు భావింతురు. అది వాస్తవముగాదు బాహ్మసమాజమునందు చేరుటవలననే సభ్యులకు బాహ్మయని పేరు వచ్చినది. నియమ పూర్వకముగా జరుగని కార్యము లెవ్వియు సఫలత