పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము,

41


ఫలించిన పిమ్మట నిశ్చయముగా వానిలో నుండి యమృతము లభించునని ఉర్రూట లూరుచుంటిమి. ఇట్టి ఆశలతో నిండి మహోత్సాహ పూరి తుడనై యున్న నేను వినమ భావములో నపుడు విద్యా వాగీశుని ముం గిట నిలచి. “ నేడీ సుముహూర్తమున పరమ పవిత్రమౌ యీ బాహ్మ సమాజ మందిరమందు విశుద్ధ బాహ్మధర్మ పతమును స్వీకరించుటకు మేమందరమును మీ చెంతకు వచ్చితిమి. మమ్ముల నందరను ముక్తి ప డోన్ముఖులను గావింపుడు. పరిమిత దేవతల యందు విరక్తిపుట్టించి ఏక మై అద్వితీయమై వెలుంగు ఆపరబ్రహ్మము నుపాపాసించు నట్లును, జీవితము నందు దుష్టకర్మలను వదలి, సత్కర్మలనే ఆచరించు నట్లును, పాపము నందును మోహము నందును తగుల్కొనక విశుద్ధాత్ములుగ నుడున ట్లును, మమ్ము నీ యుపన్యాసములచే పురికొల్పుము” అని పల్కితిని.


ఈ వాక్యముల వినియు, నాహృదయ నిశ్చయమును చూచియు విద్యావాగీశుడు కండ్ల నీరు పెట్టుకొని, “ఆహా ! నేటికిగదా, రామమోహనుని యుద్దేశము నెర వేర్థినది. నేడిది చూచుట కతడేయుండినచో ఎంత యానందించియుండునో గదా! ఎంతకాలమున కతని కోరిక నెర వేరినది ! “అని వగవజొచ్చెను. మొట్ట మొదట శ్రీధర భట్టాచార్యుడు లేచి వేదిక ముందు ప్రతిజ్ఞలనుచదివి బాహ్మధర్మమును స్వీకరించెను. పిమ్మట శ్యామచరణ భట్టాచార్యుడు, తరువాత నేను, ప్రజేంద్రనాధఠాకూరు, గిరింద నాథ ఠాకూరు, ఆనంద చంద్ర భట్టాచార్య, తారక నాధ భట్టాచార్య, హర దేశచటోపాధ్యాయ్, ఆక్షయకుమారదత్తు, హరిశ్చందనంది, లాలా హజారిలాల్ , శ్యామచరణం ముఖ్యో పాధ్యాయ్, భవానిచరణ సేను, చంద్రనాధ రాయ్, రామనారాయణ చట్టోపాధ్యాయ్, శశిభూషణ ముఖ్యో పాధ్యాయ్, జగచ్చంద్ర రాయ్, లోక నాధరాయ్, ఇంక మరికొందరును ఇట్లు మొత్తము మీద ఇరువది యొక్కరు ఒకరి వెంట నొకరు బాహ్మధర్మమును స్వీక