పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము.


సలు ప్రాతః కాలములందు జరుగుచుండెను. 'తత్వబోధినీ' సభ బ్రాహ్మసమాజ తత్వావధానము చేయవ లెననినిర్ధారణ చేయబడెను.* తత్వబోధినీ' సభాసాంవత్సరికోత్సవము ఆశ్వయుజ చతుర్ధశి నాడు జరుగుటకు బదులు బాహ్మసమాజము స్థాపింపబడిన మాఘ ఏకాదశినాడు (మాఘోత్సవము) జరుపుటకు నిశ్చయింపబడినది. 1828 సం\\ర. మున 'జోరాశాంకో' (Jorasanko సందు కమల్ బాసుకు చెందిన అద్దెగృహములో బ్రాహ్మసమాజము ప్రథమమున స్థాపింపబడెను. నేనుబాహ్మసమాజములో చేరకముందు దీనివార్షికోత్సవము 1822 సం!! నుండి జరుపుట మానిరి,


మేము బాహ్మసమాజమున అధికారము పూనుట ప్రారంభించి నప్పటినుండియు దాని యన్నత్యమున కొక మొదటి యుపాయముగా, దీని సభ్యుల సంఖ్య నభివృద్ధి చేయుట యెట్లని యోచింప మొదలిడితిని. క్రమముగా ఈశ్వరానుగ్రహము వల్లను మాప్రయత్నము లమూలమునను ఎక్కువమంది చేరుచుండిరి. సంఖ్యాభివృద్ధితో బాటుస్థల విస్థీర్ణత హెచ్చెరు. ఇదిమాకెంతయో ఉత్సాహము పురికొల్పెను.ఇంతకుముందు సమాజము రెండు మూడు కుటీరములుగా విభజింపబడి యుండెను. కాలక్రమమున నివి పడగొట్టబడెను. ప్రస్తుతమువాని బదులొక ప్రశస్తభవనము నిర్మింపబడి యున్నది. స్థలము విశాలమై సంఖ్యఅధికమైన కొలదియు బాహ్మసమాజము అభివృద్ధి నొందుచున్నదనిభావించితిమి. ఇందువల్ల మనస్సున కెంతయో ఆనందము కల్లెను.