పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

మహర్షి దేవేంద్రనాధఠాకూర్ స్వీయచరిత్రము.


బ్రాహ్మసమాజసంస్థాపకుడు, మహాత్ముడు, రామమోహనుడు ఇంతకు 11 సంవత్సరముల క్రిందట ఇంగ్లండునందు ' బ్రిష్టల్' (Bristol) నగరములో మరణించెను. బాహ్మసమాజము బాహ్మూపా సనకొరకు స్థాపింపబడినదే గావున మా 'తత్వబోధినీ' సభను దానితో చేర్చిన యాసంకల్పము ఇంకను సునాయాసముగా నెరవేరునని నేను భావించితిని. ఇట్లు భావించి నేనొక బుధవారమునాడు ఆ సమాజమును దర్శింపబోతిని, సమాజమునందొక పక్క గదిలో నొక ద్రావిడ బ్రాహ్మణుడు సూర్యాస్తమయమునకు పూర్వము ఉపనిషత్తులు పఠనము చేయు చుండెను. రామచంద్ర విద్యా వాగీశ్ , ఈశ్వరచంద్ర న్యాయ రత్న, మరియొకరిద్దరు బ్రాహ్మణులు మాత్రము వినుచు కూర్చుండిరి. శూద్రులచ్చటకు పోవుట కధికారము లేదు. సూర్యాస్తమయమైన పిమ్మట రామచంద్ర విద్యా వాగీశుడును ఈశ్వరచంద్ర న్యాయరత్న యును బహిరంగముగా వేదికపై కూర్చుండిరి. ఇక్కడ బాహ్మణులకు సూద్రులకును అందరకు సమానాధి కొరముండెను. వచ్చిన వారి సంఖ్య బహు స్వల్పముగానుండెను. "వేదిక యొక్క కుడి వైపునఒక తెల్లని దుప్పటి పరచియుంచిరి. అందు మీద నలుగురైదుగురు పాసకులు కూర్చుండిరి ఎడమ వైపున కొన్ని కుర్చీలుండెను. వానిలో ముగ్గురు నలుగురు చూడవచ్చిన వారు కూర్చుండిరి. ఈశ్వరచందన్యాయరత్నయు యుపనిషత్తులు వ్యాఖ్యానించెను. విద్యా వాగీశ మహాశయుడు వేదాంత దర్శనము యొక్క మీమాంస విప్పి చెప్పెను. వేదిక ముందు కృష్ణ, విష్ణు ఇద్దరు సోదరులు కలసి ఒక్క స్వరముతో బ్రహ్మ కీర్తనలు పాడిరి. ఉపాసనముగియున ప్పటికి రాత్రి 9 గంట లయ్యేను. ఇదిచూచి సపిమ్మట బాహ్మసమాజమును ఔన్నత్యమునకు తెచ్చు భారమును పూని “తత్వబోధినీ' సభను దీనితో సంయుక్తము చేసితిని. అప్పటి నుండియు “ తత్వబోధినీ' సభ యొక్క సమావేశము వలెగాక బాహ్మసమాజోపాస