పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

మహర్షి దేవేద్రనాధఠాకూర్ స్వీయచరిత్రము,


పడవ ప్రకరణము.



ఎంతయో సాధన చేసిన పిమ్మట నాహృదయము నందుదయించిన ఆయీశ్వరజ్ఞానము ఉపనిషత్తులలో ప్రతిధ్వనించుచుండెను. ఉపనిషదర్ధ మునుగూర్చి ఆలోచించి దానిని గ్రహించినపుడెల్ల నాహృదయమునందది ప్రతిధ్వనించు చుండెను. కావున ఉపనిషత్తుల యెడల నాకు విశేష గౌరవము జనించెను. “అతడే పిత, త్రాత, బంధువు"అని నాహృదయము ఘోషించు చుండెను. ఆదియె ఉపనిషత్తులలో " సనో బంధుర్జని తాసవిధాతా" యను శ్లోకము రూపమున కాన్పించెను' అతనిని పొందకున్న యెడల ఫుత్రులు, విత్తము, మానము, మర్యాద ' అన్నియు నాకువృధా. అతడు పుత్రులకన్నను, విత్తము కన్నను, ఇంక అన్నిటి కన్నను ఎక్కువ ప్రియమైన వాడు, అని తిరిగి తోచినది. ఉపని షత్తులవంక తిరుగగా ఇదియే ఈశ్లోకములో కనబడెను:-


“తద శ్రేయః పుత్రోత్' ప్రేయో విత్తాత్ ఎయోన్యోస్మాత్ సర్వాస్మాత్ |"


నా కైశ్వర్య మక్కర లేదు. నాకు కీర్తి అక్కర లేదు. మరి నాకు కావలసిన దేమి? “బ్రహ్మోత్యు పాసిత్ బాహ్మవాన్ భవతి”, అని ఉప నిషత్తులు ప్రత్యుత్తరమిచ్చినవి. బ్రహ్మను ఉపాసించువారు బ్రహ్మను పొందగలడు. దీనికి నాహృదయము నుండి “నిజము, నిజము” అని ప్ర త్యుత్తరము వచ్చెను.ధనమును పొందగోరు వాడు ధనమును పొందును ఇదియు నిజమే. ఎవడు ధనము నుపాసించునో అతడు ధనమును పొందితీరును. ఎవడు యశస్సు నుపాసించునో అతడు యశస్సును పొందగలు గును. అట్లే బ్రహ్మనుపాసించు వాడు బ్రహ్మను పొందునన్నమాట సత్యము, ఉపనిషత్తులలో “యఆత్మదాబల దా"అని చూచినపుడు నా