పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయ చరిత్రము




క్కరోక్కొక్కలాంతరు వేయించి కొనివచ్చుచుండిరి. సభాభనముముందు ద్యానవనములోనికి వారినాహ్వానించి • బెంచీ'లపై కూర్చుండ బెట్టితిమి. క్రమముగా జనముకిక్కిరిసి తోటయంతయు నిండిపోయెను.వీరందరిని చూచుటతో మాకు నూతనోత్సాహము జనించెను.తామెందుకు వచ్చిరో ఏమిజరుగ బోవనున్నదోవారెవ్వరికిని ఏమియు తెలియదు. ఎనిమిది గంట లెప్పుడగునాయని గడియారము తీసి ప్రతిక్షణమును ఆతముతో చూచుచుంటిని. ఎనిమిది గంటలు కొట్టినటనే, శంఖములు గంటలు బాకాలు 'డాబా మీదనుండి ఒక్క-సారిగా ఖంగున మోగెను. సభాగృహము యొక్క తలుపులన్నియుతటాలున తెరువబడెను. వచ్చిన వారందరును ఆశ్చర్య మగ్ను లయిరి.పిమ్మట వారిని లోని కాహ్వానము కూర్చుండ బెట్టితిని.ఎదురుగా వేదిక యుండెను. దాని కిరువంక లను పదుగు రేసి మంది దావిడ 'బాహణులు రెండువరుసలుగా కూర్చుండిరి. ఈ ఇరువది మందియు చంగాయవస్త్రములను ధరించి యుండిరి. రామచంద విద్యా వాగీశుడు వేదికపై కూర్చుండెను. అపుడు దావిడ బాహ్మణులు ఏక స్వరము ,వేదగానము చేయనారంభించిరి. 'వేద పఠనము ముగియున ప్పటికి రాత్రి పదిగంటలు దాటెను. పిమ్మట నేను లేచి ఉపన్యసించితిని, ఆయుపన్యాసము నందొకచో ఈవిధముగా నుడివితిని. “ఆంగ్లేయ భాషకాలములో ఆలోచన శక్తిని, విద్యను అభివృద్ధి చేయుచున్నదనియు, ఈ దేశస్థుల మనస్సుల యందావరించి యున్న అవివేకాంథకార మును చాలవరకు దూరీకృతము గావించినదనియు చెప్పుట కెంతమా తమును సందేహము లేదు. ఈ ఆంగ్ల విద్యను నేర్చినవారు, పామరులు చేయునట్లు, రాళ్ళను రప్పలను ఈశ్వరునిగా 7వించి పూజించుటఇష్టపడరు. కాని ఇదంతయు ఆంగ్ల శాస్త్రములం.దే కాని మన శ్యాన శాస్త్రములలో లేదని వారియూహ. 'వేదాంతజ్ఞానము సరిగ వ్యాపింపకుండుటచే