పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము.

28


వచ్చునని యొక విశేష నియమముండెను. ఈనియమము ననుసరించి మాలో కొందరము వ్యాసములను తీసికొని "వెళ్ళి, సంపాదకుడు నిద్రలేచి లేవగనే చూచునుగదాయని అభిప్రాయముతో అతని శయ్యపై దిండు కింద పెట్టుచు నెంతో యుత్సాహముతో నుండెడివారము, మూడవ సంవత్సరములో నీతత్వబోధినీ సభ యొక్క ప్రథమ వార్షికోత్సవము మహా వైభవముతో జరుపబడెను. రెండు సంవత్సరములు గడచెను గాని ఇంకను సభ్యుల సంఖ్య అంతగా లేదు. ఈసభ యొకటి యున్నట్ల! కూడ చాల మందికి తెలియదు. ఎట్లు ఈకొఱత దీసి వేయుటయని ఆలోచించుచుంటిని ఇది 1841 వ సంవత్సరమందు. ఈసాంవత్సరికోత్సవము అందరకు తెలియునట్లు ఒక పెద్ద సభ గావింప నిశ్చయించితిని. వార్తాపతికలలో ప్రకటించెదమన్న ఆదినములలో" వార్తాపత్రికలకంత వ్యాషన యుండెడిది కాదు. కాబట్టి కలకత్తాలో నున్న కచేరీలలోను, కార్యాలయములలోను, ఉద్యోగస్థుఁలు గానున్న వారందరి పేరనువారి కచేరీలకు ఆహ్వాన పత్రికలను పంపితిని. ప్రతివారును కచేరీకి బోవు సరికి వారి బల్లలపై నొక్కక ఆహ్వాన పత్రిక యుండెను. విప్పి చూచుకొనిరి. అది “తత్వబోధినీసభ ” ఆహ్వానము. ఈసభ పేరెప్పుడును వారు విని యుండ లేదు. అయినను ఎవరైనవత్తురా రారాఅను ఆలోచన చేయక మేము మాత్రము రోజంతయు సభావిషయమగు పని చేయుచుంటిమి. సభాగృహము నేవిధముగ నలంకరించిన బాగుండును, 'నాడేమి వ్యాసములు చదువుదుము, ఏమియుపన్యాసములిత్తుము, ఎవరెవరేమేమి పని చేయుదము అని ఇట్లెంతో ఉత్సాహముగా ఈప్రయత్నములమీదనే యుంటిమి, సూర్యాస్తమయమగు నప్పటికి దీపములు వెలిగించితిమి. సభాభవనము నలంకరించితిమి. సమస్తమును సిద్ధము చేసితిమి ఈ హ్వానమును మన్నించి ఎవరైనను ఇంతకును వత్తురా రారాయని నేను ఆత్రము చెందుచుంటిని. చీకటి పడిన తోడనే అనేకమంది, ఒక్కో