పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈశ్వరుడు నిరాకారుడనియు చైతన్య స్వరూపుడనియు సర్వగతుడనియు అచింత్యుడనియు అనిర్వాచ్యుడనియు చెప్పుమన శాస్త్రములను వారు గ్రహింప లేక ఇట్లభిప్రాయ పడుచున్నారు. మన ధర్మమునందలి పరిశుద్ధ బ్రహ్మజ్ఞానము పొందజాలక అన్యధర్మావలం బీకుల శాస్త్రము లలో వెతుక నారంభించుచున్నారు. మనశాస్త్రములయందు చెప్పబడిన దంతయు కేవలము సాకారోపాసనయే అని వారు దృఢముగ నమ్ముచున్నారు. కాని వేదాంత ధర్మమునే బాగుగ వ్యాపింప జేసినచో తక్కిన మతముల కొరకట్లు ఆశింపము, గావున ఇట్టివ్యాపసను జేసిమన హిందూధర్మమును కాపాడుటకు మేము ప్రయత్నించుచున్నాము.”


నాయుపన్యాసానంతరమున శ్యామచరణుడు తన యుపన్యాసము చదివెను. పిమ్మట చందనాధరాయ్, తరువాత ఉమేశచంద్రరాయ్, అటుపై ప్రసన్న చంద్ర ఘోష్, తదనంతరము అక్షయకుమారదత్ , ఆఖరున రామప్రసాదరాయ్ ఉపన్యసించిరి. అప్పటికి రాత్రి 12 గంటలు దాటిపోయెను. ఇదంతయు ముగిసిన పిమ్మట రామచంద్రవిద్యా వాగీశుడు ప్రసంగించెను. అటు పైన కీర్తనలు పొడితిమి. రెండు గంటలు దాటెను. జనులు మిక్కిలి ప్రయాసము చెందిరి. అనేకులు “ ఆఫీసు నుండి తిన్నగ నిచ్చటి కేవచ్చిరి. నాయందుండిన గౌరవము చేసభ ముగియు వరకును ఎవరును వదలి వెళ్ళలే లేకపోయిరి. మేము చెప్పిన దనే కులు వినియుండరు ఒక వేళ విన్నను అనేకులకు తెలిసి ఉండదు. ఐనను సభమాత్రము మహా వైభవముతో ముగిసేను. మా ' తత్వబోధినీ ' సభ యొక్క ప్రథమసాంవత్సరికోత్సవము ఇదియే. అంత్య సాంవత్సరీ కముకూడ ఇదియే ఇది జరిగిన పిమ్మట 1842 వ సంవత్సరమున నేను బ్రాహ్మసమాజములో చేరితిని,