పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరవ ప్రకరణము.

25


“మూర్ఖులకును ధనాంధులకును అజ్ఞానులకును ముక్తి మార్గము కాన్పింపదు. ప్రపంచమే శాత్వతమనియు పరలోక జీవితము లేనే లేదనియు నమ్మువారు తిరిగి తిరిగి ఆమృత్యువువాతను పడుచునే యుందురు.”

నాయుపన్యాసము నందరును పవిత్రభావముతో నిశ్శబ్దముగ నాలకించిరి. ఇదియే నాప్రథమ ధర్మోపన్యాసము, ఉపన్యాసము ముగించిన పిమ్మట యీసభ “తత్వరంజని” అనునామముతో పిలువబడును గాకయనియు ఇది చిరస్థాయిని అగుగాక అనియు ప్రస్తాపించితిని. దీని కందరును తమ సమ్మతితెలియ జేసిరి. సంఘము యొక్క ఉద్దేశము బ్రహ్మజ్ఞాన సంపాదనము, ప్రతిమాసమును మొదటి ఆదివారము సాయంకాలము సభచేరు చుండవలయునని స్థిర పరుపబడెను. రెండవ సారిసభ కూడినప్పుడు రామచంద్రది విద్యావాగీశుని ఆహ్వానించితిమి. అతనిని ఆచార్య పదవియందు నియమించితిని. అతడే సభకు తత్వరంజని అను నామమునకు బదులుగా " తత్వబోధిని” అను నామముంచెను. ఈ ప్రకారము 1889 వ సంవత్సరము, అక్టోబరు 6 వ తేదీని "తత్వబోధినీ” సభ సంస్థాపిత మయ్యేను,


ఆఖువ ప్రకరణము.

'తత్వబోధినీ' సభ 1889 వ సంవత్సరం, అక్టోబరు మాసములో ప్రతిష్టిత మయ్యెను. మన శాస్త్రముల యందలి నిగూఢ తత్వమును, వేదాంతములో ప్రతిపాదింపబడిన బాహ్మవిద్యయును ప్రచారముచే యుటయే దాని ముఖ్యోద్దేశము. వేదాంత దర్శనము యొక్క సిద్ధాంతములందు మాకంత నమ్మకము లేదు, ఉపనిషత్తులనే వేదాంతముగా