పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


నేను వేదములను సరియగు స్వరముతో ఉచ్చరించుట విని విద్యావాగీశుడు నన్ను, “ నీవీ స్వరమును ఎట్లు నేర్చి కొంటివి ” అని అడుగు చుండెను. నా కాప్రకారము చ్చరించుట మొదట తెలియదు. కాని తర్వాతనొక దావిడ వైదిక బ్రాహ్మణుని వద్ద నేర్చి కొనుటచే నా కది పట్టుబడినది.


ఉపనిషత్తులలో ఎప్పుడు విశేష ప్రవేశము కలిగినదో, సత్య జ్యోతిచే ఎప్పుడు నాజ్ఞానము ప్రకాశింప జేయబడినదో, అప్పటి నుండియు ఈసత్య ధర్మమును వ్యాపింప జేయ వలెనని నామనసు నందొక ప్రబలమగు ఇఛ్ఛజనించెను. ప్రపథమమున నాసోదరుల తోను, స్నేహితులతోను బంధువులతోను ఒక సంఘము నేర్పరుప నెంచితిని. మాస్థలములో నున్న చెరువుయొద్ద చిన్నగది యొకటియుండెను. దీనికి వెల్ల 'వేయించి శుభము చేయించితిని. ఇంతలో దుర్గా పూజ దినములు ఆసన్నమాయెను. మా కుటుంబములో నందరు ఉత్సవమున అత్యుత్సాహముతో పాల్గొనిరి. మేము మాత్రము శూన్య హృదయుల మైయుందుమా? ఆకృష్ణ చతుర్దశి నాడు మహెత్సాహముతో మేమొక సంఘమును స్థాపించితిమి. మేమందరమును ప్రాతస్నానము చేసి పరిశుభ్రులమై ఆ సరోవర తీరమున నున్న గదిలో కూర్చుంటిమి. ఇట్లు వారితో గూర్చుండగనే నాహృదయము భక్తిపూరిత మైనట్లు తోచెను. నలుదిక్కులు చూచు సరికి ప్రతి ముఖమును భక్తితో ప్రకాశించు చుండెను. గది యంతయు పవిత్రభావముతో నిండి యుండెను. భక్తిభావము "* ఈశ్వరునాహ్వానము చేసి కఠోపనిషత్తులోని ఈకింది '

శ్లోకమును వ్యాఖ్యానము చేసితిని. - " నసొంప రాయప్రతి భౌతిబలం ప్రమాద్యంతంవి త్తమోహనమృఢం |
 అయంలో కోనాంతి పరహితమనీ పునః పునర్వశీ మాపద్వౌతౌ మే || "