పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

మహర్షి దేవేంద్రనాధఠాకూర్ స్వీయచరిత్రము.


భావించు చుంటిమి. మొదటి దినమున దీనియందు 10 మంది మాత్రమే సభ్యులుండిరి. ఈ సంఖ్య క్రమముగా వృద్ధినొంద సాగెను. ఆరంభమున దీని సమావేశములు మా గృహమునందు కింది అంతస్థునందొక విశా లమైన చావడిలో జరుగుచుండెడివి. తరువాత సుకియావీధి YSokes Street) లోనొక యిల్లు అద్దెకు దీసికొంటిమి. ఆయిల్లు ప్రస్తుతము కాళీకృప్ల ఠాకూరుగారి ఆధీనములో నున్నది. ఈ రోజులలో నాకు అక్షయకు మార దత్తుతో స్నేహమయ్యెను. ఈశ్వర చంద్రగుప్త ఈయనను తీసుకొనివచ్చి నాకు పరిచితుని చేసేను. అక్షయ బాబు 'తత్వబోధినీ సభలో సభ్యుడయ్యెను. సంఘము ప్రతిమాసము మొదటి ఆదివారమురాత్రి సమా వేశమగుచుండెను. ఆచార్య పదవి నుండి రామచం ద్ర విద్యావాగీశుడు ఉపన్యసించుచు ప్రతిసారిని ఈ క్రింది శ్లోకము చదువువాడు:-


<poem><శ్లో|| రూపంరూపవివర్జిత స్వభవతో ధ్యానేన యద్వర్జితం | స్తుత్యా నిర్వచనీయ తాఖలగురో దూరీ కృతాజస్మయా | వ్యాపిత్వం చవినాశతం భవగతోయా తీర్థయాతాదినా | క్షన్తవ్యం జగదీశ తద్వికల తాదోషతయం మత్కృతం ||/poem>


“హే ! అఖలగురూ! నీవు రూపవివర్జితుడవు. అయినను ధ్యానము చేసి నేను నీకురూపమును కల్పన చేసితిని. మరియు నిను స్తోత ముచేసి నీ అనిర్వచనీయతను దూరము చేసితిని. తీర్థయాత్రల సేవించి నీ సర్వ వ్యాపిత్వమును వినాశము గావించితిని. హేజగదీశ్వరా! చిత్తవికృతివల్ల నేను చేసిన ఈమూడు దోషములను క్షమింపుము.”


ఈసమా వేశములలో ఉపన్యసించుటకు సభ్యులందరకును సమా సాధికారము కలదు. కాని ఏసభ్యుడందరకన్న తనవ్యాసమును వ్రాసి సంపాదకును ఇచ్చునో అతడు మాత్రమే తనవ్యాసమును సభలో చదువ