పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ ప్రకరణము

19


ఆతని యడుగులలో నడుగు వేసి నడువవలెనని మనస్పూర్తిగా దృఢ సంకల్పము చేసికొంటిని.


చిన్నప్పటి నుండియు నేను రామమోహనరాయల నెఱుగుదును, 'నేనతని పాఠశాల కే పోవుచుంటిని, ఇతర పాఠశాలలు, ఇంతకన్న మంచివికూడ కొన్ని ఉం కాను. కాని రామమోహనుని సలహా పైని మాతండ్రి నన్నాతనిస్కూలుకే పం పెను. ఆస్కూలు “హెద్వా" చెరువు (hedua tank) దగ్గర ఉండెను. సాధారణముగా ప్రతి శనివారము 2 గంటలకు స్కూలు విడిచి పెట్టిన తరువాత మణిక్టోలా (Maniktola) యందుండిన రామమోహనుని ఉద్యాసభవనమునకు [1] రామప్రసాదుతో పోవువాడను. ఇతర సమయములందు కూడ నేనాతనిని చూచుటకు వెళ్ళుచుంటిని. అప్పుడ ప్పుడక్కడకు వెళ్ళి అనేక కొంటి చేష్టలనుకూడ చేయువాడను. 'లిచ్చీ' ఫలములనుకోసికొని పచ్చి బటాణీల నేరికొని మిక్కిలి ఇష్టముతో తినువాడను. ఒక రోజున రామమోహనుడు నాతో, “తమ్ముడూ ఎండలో ఎందుకు తిరిగెదవు. ఇక్కడ కూర్చుని నీయిష్టమువచ్చినన్ని పండ్లను తినుము” అనుచు, తోటమాలితో “చెట్లనున్న లిచ్చీలను కోసి తీసికొనిరమ్ము” అనెను. వెంటనే అతడొక పళ్ళెమునిండ పండ్లను తీసికొని వచ్చెను. అప్పుడు రామమోహనరాయలు నాతో “ఇవిగో, ఇపుడు నీ యిష్టమువచ్చినన్ని పండ్లను తినుము” అనెను. కామమోహనుడు మిగుల ప్రశాంతమూర్తి. శాంతముతో కలిసి గాంభీర్యముకూడ ఆతని ముఖము నందు కన్పించు చుండెను. నేనాయన యెడల మిగుల భక్తిశ్రద్ధలతో మెలగువాడను.


ఆతని ఉద్యాన వనములో నొక ఉయ్యెలఉండెను. "దేహవిశ్రాంతికొరకు రామమోహన రాయలు అందులో ఊగుచు డెడివాడు. ఆ ప్పుడప్పుడు నేను సాయంత్రము తోటకు వెళ్ళినప్పుడు నన్నందులో కూ


  • • రామమోహనుని కుమారుడు,