పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


నడి మధ్యమునకు ఎగిరి పోయెను. ఒడ్డునుండి అనేకులు ఐకకంఠ్యముగా “ఇప్పుడు పోవలదు ! పోవలదు ! " అని అఱచుచుండిరి. అప్పుడు నా హృదయము వణక సాగెను. ఏమిచేతును ? వెనుకకు మరలు ఉపాయములేదు. తెరచాప గాలితో నిండి యున్నది. నావముందుకు భయంకరముగ దూకుచున్నది. అట్లే కొంత దూరము పోతాయి. ముందుజూడ తరంగముపై తరంగమధివసించి గోపురముల నిర్మించు చున్నట్లు కన్పించుచుండెను. వీటిని భేదించుటకా యన్నట్లు నౌక పౌరుషముతో ముందునకు ఉరుకుచుండెను. నాశరీరము వణక సాగెను.


ఇ తరుణమున అనతి దూరమున నొక చిన్న ‘డింగీ' యొకటి అరటిపువ్వు రేకువలె, గాలి దూకుడుచే కెరటములందు అల్లాడి పోవుచు మావంక కొట్టుకొని వచ్చు చుండెను. దాని నావికుడు మాయవస్థను జూచెను. మహా భీకరమగు తుపానునందు అసహాయముగా నల్లాడిపోవు చుండిన మమ్ముజూచి, ఎంతటి పరమ నిరాశాపరున కైనను ధైర్యమును పురిగొల్పు గీతిని ఎలుగెత్తి; “భయమువలదు ! భయమువలదు! పొండు, ముందుకుపొండు !” అని ప్రోత్సహించెను. ప్రాణములు లేచి వచ్చినవి. ముందుకు పోతిమి.


ఇట్టిది నాపిడు కావలసిన ధైర్యము. కాని ఎవ్వరున్నారు, ఇచ్చువారు?


ఐదవ ప్రకరణము.

ఈశ్వరుడు ఆకారరహితుడని నేను గ్రహించి నప్పటినుండియు విగ్రహారాధనయందు నామనసులో నొక తీవ్రమైన అసహ్యము కలి గెను. రామమోహనరాయని జ్ఞప్తికి తెచ్చికొంటిని. ఇప్పటికి కళ్లుకన బడినవి. అతనిషద్ద తియంద మిత ఆదరము కల్గినది. ఇక మీదట పూర్తిగ