పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గన ప్రకరణము.

17


నేనెక సారి మాజమీయగు కాళిగ్రామమునకు పోతిని, చాల దినము లటనుండి తిరిగి యింటికి వచ్చు చుంటిని. పద్మానది యందు నావలో ప్రయాణము. వర్ష కాలము. కొంతదవ్వు సాగిపోతిమి, ఇంతలో కారుమబ్బులతో అంబరమునిండిపోయెను. ప్రళయప్రచండ జంఝామారుతములు హోరున వీవసాగెను. పద్మానదియంతయు మహాసాగరమై పోయెను. ఇట్లు గోప్పతుపాను వీచుచుండుట జూచి నావికుడుముందు కుపోవుటకు సాహసింపక నావను ఒడ్డునకుకట్టి వేసెను. అయినను అజల యల్లాటముచే నావ అక్కడకూడ స్థిరముగ నిలచియుండ లేదు. బహు దినములయినది. ఇల్లువదలి త్వరలో గృహము, చేరవలెనను వాంఛ తీవముగా నుండెను. మధ్యాహ్నము నాల్గుగంటలకు తుపానుకొంచము శాంతించినట్లు కాన్పించెను. “ఇప్పుడు నావను నడపగలవా” 'యని నావికునడిగితిని. “ఏలినవారి యాజ్ఞయైనచో నడపగలన"ని వాడు బదులు చెప్పెను. 'అట్లయినచో వదలు'మంటిని. గాని ఎంత సేపటికిని నావ కదల లేదు. అరగంటయైనది; ఇంకను కదలునూచన కనబడదు. నావి కుని పిలచితిని, “నా సెలవైనచో నౌకను వద లెదనంటిఐ. నాయజ్ఞ నిచ్చితినే ! ఏలయింకను బయలు దేరవు? తుపాను ఇప్పుడే కొంచము శాంతించినది. మరల ప్రారంభించు నేమో, ఎవరు చెప్పగలరు. గావున బయలు దేరదలచినచో 'వెంటనే బయలు దేరుము”, అంటిని. అప్పుడతడు పెద్ద దివాన్జీగారు తనతో నట్లు చెప్పినట్లు బదులి డెను. "ఓరీ, మూర్ఖ! ఇది శారదా సంగమమని యెరుగవా ? అవతలదరి కాన్పించుట లేదు. ఇది శ్రావణ సంక్రాంతి. ఒడ్డున నైనను నావ తరంగముల ధాటికి ఆగ లేదు. నీవు చూడ ఇట్టి సమయములో పద్మానది దాటెదననుచున్నావు. నీయుద్దేశ్యమేమి?” ఆమాటలతో బెదరి పోయివాడు నౌకను బయలుదేరదీయ లేదు. అయినను నేను బయలు దేరు మంటినీ, వెంటనే అతడు తెరచాపవిప్పి పడవను దో సెను. ఒక్కసారి గాలి విసరగనే పడవ