పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.

ట్రములోని 'కాళీదేవియును కాదు, దేవతార్చన గృహములోని సాలి గ్రామమును కాదు. ఈ ప్రకారముగ విగ్రహారాధన మొదలంటనరక బడినది. సృష్టి యొక్క కౌశలచింతనవల సష్ట యొక్క జ్ఞాన పరిచయమును పొదగలు మము, నక్షత్రచకిత నీలాంబరమువంక చూచుట వలన ఈశ్వరుడనంతుడని తెలియుచున్నది. ఈసూత్రము యొక్క ఆధార ముతో అతని స్వరూపము మనసునకు మరింత గోచరము కాగలదు. అనంతజ్ఞాన స్వరూపుడగు నాతని యిచ్చను ఎవ్వరును ఆటంక పరుప నేరరని ఇంకొక సుగతి తెలిసికొంటిని. ఆతనియిచ్చ నెరవేరి తీరును. మనమొక వస్తువును చేయునపుడు దానిక వసరమైన యుపకరణముల మొదట సమకూర్చి అపుడు దానిని చేయుదుము. కాని ఈశ్వరుడట్లు గాక తన యిచ్చా మాత్రమున సమస్త ఉపకరణములను సృష్టించి, ఈజగత్తును రచన చేసియున్నాడు. అతడు కేవలము ఈజగత్తు యొక్క రచనకర్త యేగాదు! అంతకన్న అధికుడు ! ఆతడు దాని సృష్టికర్త, సృష్టియంతయు అనిత్యము, పరివర్తన శీలముకలది, పరతంతము, ఏపరి పూర్ణజ్ఞానము దీనిని సృష్టించి నడిపించు చున్నదో, అదిమాత్రతమే శాశ్వతము, ఆదికృతము, సర్వ స్వతంతము, అపరివర్తనీయము. ఆనిత్య సత్య పరిపూర్ణుడే సర్వమంగళ్య సంధాయి. సకల సంస్తవ నీయుడు.


ఇట్లు దినములకొలది నామనసులో తర్కించుకొని తర్కించు కొని ఇంత వరకును స్థిరపరచుకొంటిని. "కాని యింకను నాచిత్తము కంపించుచునే యుండెను. ఇంకను సంతుష్టీ లేదు.జ్ఞాన పథము అతి దుర్గ మపథము ! ఈమార్గమునందు నాకు స హవాసముండు వారెవరు? నేను స్థిరపరచుకొనిన యీసిద్ధాంతమును ప్రోత్సహించు వారెవరు? ధైర్యము కొపుకొల్పు వారెవరు? ధైర్యమని ననె ధైర్యము? నాడుపద్మానదిమీద నావికునివద్ద నుండి నేను పొందిన ధైర్యమువంటి ధైర్యము. అదియేమో తెలియ జెప్పెదను; —