పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము,


ర్చుండ బెట్టి ఆయన స్వయముగా నన్నూపువాడు. అట్లూపి కొంత సేపైన పిమ్మట తానందులో కూర్చుండి, “నాయనా! ఈసారి ఊపుటవంతునీది” అనువాడు.


మాతండ్రికి నేనే జ్యేష్ఠ పుత్రుడను, ఇంట్లో ఏడైనను శుభకార్యము వచ్చినప్పుడు "నే నేయింటింటికి వెళ్ళి పిలువవలసి వచ్చడిది. ఆశ్వయుజమాసములో దురోత్సవము. రామమోహన రాయుని పిలుచుటకు బోతిని. “పూజమూడుదినములు ప్రతి మాదర్శనమునకు రామణిఠాకూర్ తమరిని దయచేయమనిరి” అంటిని. అందుపై నాతడు, “నాయనా! నన్నెందుకుపిల చెదవు? రాధాప్రసాదును పిలువుము” అనెను. ఇప్పుడింత కాలమైన పిమ్మట ఈమాటలన్నీటికిని నేటికి గదా అర్తమును గ్ర హించితిని! రామమోహనునివలెనే నేనును విగ్రహారాధనను చూడనని ఇపుడు మనసులో నిశ్చయించికొంటిని. నేనే విగ్రహమునకును 'మొక్కను, సవిగ్రహపూ జకును ఆహ్వానము పొందను, అని అప్పటి నుండియు నాసంకల్పమును దృఢ పరచికొంటిని. ఇందువల్ల ముందు ఎన్ని కష్టములు సంభవించునో కొంచమైనను అప్పుడు గ్రహింప లేకపోతిని, పిమ్మట నాసోదరులకు కూడ ఈవిషయమును చెప్పి వారితో కలసి ఒక కట్టుకట్టితిని. నవరాత్రములలో పూజూగృహమునకు ఎవ్వరమును పోగూడ దనియు, పోయినను ఏవిగ్రహమునకును మొక్క గూడదని యునిశ్చయించి కొంటిమి. రోజును మా తండ్రి పూజాగృహమునకు సాయంత్రము హారతి సమయమున వెళ్ళు వాడు. ఆయన ననుసరించి మేమును వెళ్ళవలసి యుండెను. కాని విగ్రహ మునకు మొక్కడు సమయమున అందరును భూమిపై సాష్టాంగ పడి నపుడు మేముమాత్రము నిలబడియే యుండువారము. మేము మొక్కితి మో లేదో ఎవరికిని తెలిసెడిది కాదు.


ఏదైన శాస్త్రమందు విగ్రహారాధనా సంబంధమగు ఉపదేశములుండిన యెడల నాకాశాస్త్రమునందిక గౌరవముం డెడిది కాదు. ఇం