పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము,


సహితము అభివృద్ధి జెంది పక్క ప్రక్కన ప్రవహించుచుండును. తీర మునందలి జలము ఎప్పటియట్ల ఉష్ణముగనే యుడును. అనేక మంది రోగులు ఇచ్చట స్నానము చేయుటకు వచ్చుట చూచితిని. అక్కడ స్నానము చేసినచో అనేక విధములైన వ్యాధులు ఉపశమించునని వింటిని.

ఈ పర్వత వాసులగు భూస్వాములలో ప్రధానుడు రాజు. తర్వాత రాణా,తర్వాత ఠాకూర్" , కట్ట కడపట జమీందార్ .* [1]ఇక్కడ జమీందారులు కృషికులు, ఉత్తర హిందూస్థానము లోని జమీందారులు కూడ యిట్టిదశలోనే యున్నారు. పర్వతములందు రాజులు, రాణాలు అధిక శక్తి సంపన్నులు. వీరే ప్రజలకు శాసనకర్తలు. వారల వివాహములందు సఖీగణ సహితముగ కన్యా ప్రదానము గావింపబడును. రాణీ గర్భమున జనించిన పుత్రుడు రాజు యో రాణాయో అగును. సఖుల గర్భమున జన్మించిన పుత్రులు రాజ పరివారముగా నుండి యావజ్జీవము పోషింప బడుదురు. సఖుల గర్భమున జనించిన పుత్రికలు రాజకుమార్తె యొక్క సఖులని పిలువ బడుదురు. వారిజీవనమును యౌవనమును రాజకుమార్తె భర్తకు సమర్పింప వలసిన వారై యుందురు. ఎంతటి అనర్ధము ! ఎంతటి అనర్ధము ! రాజులు, రాణాలు అనేక రాణీలను కలిగి యుందురు. గనుక అనేకమంది సఖులనుగూడ గలిగియుచురు. ఒక్క భర్తర్త చనిపోయినప్పుడు ఖదీలవలె నిందరును కారాగారమున యావజ్జీవమును దుఃఖించుచుందురు. వీరికి పరితాలోపాయము లేదు.


నేనక్కడ వారముదినము లుంటిని. పిమ్మట రాణావద్దను రాజ గురువువడ్డను సెలవు కొని సిమ్లా అభిముఖుడనై పర్వతారోహణము


  • వంగ దేశమునందును, దక్షిణ హిందూ దేశమునందును జమీందార్ అన్న పదముఖకు విశేష భూవసతిగల యుక ప్రభువని ఆర్థమ.. ఇచట నాపదము అన్యార్థమున వాడబడుట మసకు చిత్రముగ దోచును.