పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదిదియేడవ ప్రకరణము.

201



చేయ నారంభించితిని. కొంతమార్గ మేగినపిమ్మట నొక వనము ప్రవే శించితిని. మృగయాశీలుడైన రాజకునూరుడు రత్నకుండలములు, వజ్రహారము, మౌక్తికమాల, దీవ్యవస్త్రములు ధరిచి వనమును... వనాంతరమునకు వేటాడుచు పోవుచుండెను. సూర్యకిరణముల దాతని సవీన ముఖమండలము దీప్తి వహించి శోభాయమానమయ్యెను. నా కతడొక వన దేవతవలె గన్పట్టెను. ఇట్టే ఒక క్షుణమా త్రమతని చూచి తీని, మరుక్షణమున వనమధ్యమున జొరబడి యాతను మాయమ య్యెను. ఇంతలో తిరిగి చెత నే గన్పట్టను. మురలనిట్టె దూరమగు చుండెను. 'నేను అతికష్టముతో " ఒక సంకీర్ణ పథమున ఆరోహణము చేసి నిర్విఘ్నముగా సిమ్లాలో నుపస్థితుడ నైతిని. ఫాల్గుణమాసమునందు సహితము సిమ్లా వీధులలో మంచుపడియుండెను. లతలు, వృక్షములు , సర్వము శుష్కించి నీర సములై యుండెను. గాలి వీచినపుడెల్ల అసొ రము లైన వెదురుబొంగులవలె నవి కట్ కట్ మను చప్పుడు చేయు చుండెను.


చైతము గడచిపోయెను. నానాసుపుష్పశోభితమై యావద్భూమియు నొక్క మనోహర ఉద్యాన భూమిగా మారిపోయెను. మరి యొక నూతనవత్సరమును దర్శించితిని, గత వైశాఖము నందు ప్రధమమున ప్రవేశించిన గృహమునం దే ఒక్క సంవత్సరము డచిపోయెను.ఇప్పుడీ బజారులోని గృహము వదలి పర్వతముపై నాకు మిక్కిలి యిష్టమగు 'ఒక సురమ్య నిర్జన స్థానమునందొక బంగళాను అద్దెకు తీసికొంటిని. ఆ పర్వతము పై నొక్క వృక్షము మాత్ర ముండెను. అనిర్జన స్థామున నదియే నాకు మిత్రమయ్యెను. ఈ వైశాఖ మాసము నందు మధ్యాహ్న భోజనానంతరమున ఆనందముతో నచటి ఖాళీగృహముల యందలి ఉద్యానవనముల యందు విహారము చేయు వాడను. వైశాఖ మాసము నందు మట్టమధ్యాహ్న వేళ ఎండలో పెద్ద ఉన్ని చొక్కాను