పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది యేడన ప్రకరణము,

199


వంటిది 'మేమీ నదీతీరమున నొక కాశీ ఘట్టమును నిర్మించితిమి.” అని కూడ చెప్పెను. కాని దానిని చూచుటకు నేను రాజాలనని చెప్పితిని. పిమ్మట ఆయన వద్దనుండి రాణాను చూచుటకు వెళ్లితిని. ఒక పెద్దసావడిలో కుర్చీలు వేయబడి యుడెను సభాసద్గణ సమన్వితు డే రాణా నాకు స్వాగతమిచ్చి నన్నొక కుర్చీపై కూర్చుండ బెట్టెను. ఇత రులు వేరు వేరు కుర్చీలపై కూర్చుండిరి; క్షణమైన పిమ్మట కుమార సదృ శుడగు రాజకుమారుడు వచ్చి ' సభాభవన మలుకరించెను. అపుడు రాణాసాహేబ్ నానిట్ల నేను, “కుమారుడు కొంచెము సంస్కృతము నేర్చుకొను చున్నాడు. మి రాతని కొంచెము పరీక్షింపుడు.” ఇది విని కుమారుడు, “నేను వ్యాకరణము సొంతముగ చదివితిని,” అనెను. “గంగ, ఉదకము సంధి కలిపినచో పరూపముపొందను?” అని నే నడిగితిని. “గంగోదకం" అని వెంటనే బిగ్గరగా ప్రత్యుత్తర మిచ్చెను. రాణా నద్దనుండి సెలవుగై కొని వచ్చి స్నానము చేసి భుజించితిని.


మరునాటి ప్రాతః కాలము శతద్రీనదీ తీరమునందు బ్రమణము కొరకు ఒంటిగ బయలు వెడలి తిని. ఇక్కడ నది కృష్ణ నగరమునందలి జలంగీనదియంత వెడల్పుగ నుండెను. దానిజలము సముద్ర జలమువలె నీలముగ, ఉజ్జ్వలమై, స్వచ్ఛమై యుండెను. వాల్మీకి తన తమసానదీ జలముల గూర్చి చెప్పిన “సజ్జనచిత్త మలం బోలి పరిశుభ్రములై " అ ఉపమానము ఇచటి శతద్రీనదీ జలంబులకుం గూడ చక్కగ వర్తించును. నేనుక తోలుదోనె మీద నానది దాటితిని. ఈనదిలో కర్రదో నెలు పనికి రావు. నదిలో మధ్య మధ్య పెద్ద పెద్ద శిలలుండెను. తోలు దోనెలు తప్ప నది దాటుటకు అన్యోపాయము లేదు. ఆవల దరి చేరు సరికి అక్కడ జలము మాంఘీర్ లోని “సీతకుండ» జలములంత ఉష్ణముగానుండెను. ఇందలి విశేషాశ్చర్య మేమన వర్షా కాలమునందు నది క్రమముగా వృద్ధినొంది ఉష్ణ జలము స్థానమాక్రమించినట్లే, ఉష్ణ జలము