పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము,

.


ఈయన తాంతిక బ్రహ్మజ్ఞాని. ఈయనమతము మహానిర్వాణ తంత్రోక్తమగు అద్వైతము. నేను సిమ్లాలో నుంటినని విని ఈయన యే రాణాతో నన్నాహ్వానింపుమని కోరెను.నాతో భోజనము నందును పానము నందును వేడుక ననుభవింప నచ్చునని అతడు ఆశ పడెను, పరస్పర సద్భావమును సుహృద్భావముతోను అన్యోన్యము బంధింపఁబడుదుమని యూహించెను. 'నేను మద్య పాన విరత్తుడననియు, నామతములోమద్య పానము ధర్మవిరుద్ధమనియు నాత డెరుగడు

“మద్యమదేయమ పేయ మగాహ్యం" __మద్య మొకరి కీయ రాదు, పొనము చేయరాదు. స్పర్శింపరాదు-

నేను వారి పానాదికములయందు చేర లేకపోవుట వల్ల వారి యుత్సాహమును, ఆమోదమును భంగమై పోయెను. వారిందు మూల మున మిగుల దుఃఖితులును విషజ్ఞులు నైరి. నాభోజనమునకు ప్రత్యేక ముగ నేర్పాటులు గావించినందులకు కిశోరిపై నేర ముంచిరి. నేను కఠోపనిషత్తు పై వ్రాసిన వ్యాఖ్యానములయెడల సుఖానందుడు అత్యంత అసంతుష్టి కనబరచెను.ఈ వ్యాఖ్యానములు శంకరాచార్యుని భాష్యము.." సమ్మతముగ లేవు. అందువల్ల మీవ్యాఖ్యానములు ఆదరణబడయుట ' లేద”ని నాతోచెప్పెను. బాహ్మధర్మ గ్రంధమును హిందీ భాషలోనికి అతడు అనువాదము చేసెను. అది నాకు చూపించి ముద్రింపుమని కోరెను. నేనాతనివద్ద 'సెలవుగైకొనినప్పుడు అతను నాతో క్రిందికి వచ్చి యొక గది చూడుమని కోరెను. నేనాగది ప్రవే శించి చూచితిని. ఎదురుగానున్న గోడపై నొక సుందరమైన పఠము వేలాడగట్టబడి యుం డెను. దానిమధ్య "ఓం ! తత్ సత్ ” అని దేవ నాగర స్వర్ణాక్షరములతో వ్రాయబడియుండెను. సుఖానంద స్వామి అతిభ క్తి తో నాగదిని ప్రవేశించెను. "కలకత్తా వద్దనున్న కాశీఘట్టము