పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియే.డవ ప్రకరణము,


మాఘమాసావసాన కాలమందు నేను బాహ్మచింతలో నిమగ్నుడనై కూర్చుండినప్పుడు ఒక పెద్దమనిషి చేతులకు బుగారు మురుగులు ధరించి నావద్దకు వచ్చిను. నాతో" నాయన “నేను భజ్జీ రాణా యొక్క మంత్రిని. వజీరును. రాణా సాహేబ్ తమరిని నిమంత్రణ చేయుటకుగాను సన్నంపినారు. ఆయనకు మిమ్ములను దర్శింపవలెనని కోరిక గా నున్నది. ఇక్కడనుండి భజ్జీ అధిక దూరము లేదు. ఏకష్టము లేకుండ మీరక్కడకు ప్రయాణ మొనర్చుటకు నేను తగిన ఏర్పాటులు గావించెదను” అనెను. నే నాయన నియంత్రణము స్వీకరించి అక్క డకు పోవు తేదీ నిర్ణయము గావించు కొంటిని. ఆ నిర్దిష్ట దినమున వజీర్" వచ్చి నన్ను గొంపోయెను. ఆయన గుర్రముమీదను నేనొక సవారి లోను ఎక్కి సిమ్లా నుండి క్రిందనున్న లోవకు దిగుటకు ప్రారంభించి తిమి. ఈ దిగుటకు అంతు లేనట్లుండెను. ఎంత కిందికి వెళ్ళినను ఇకను కిందికి వెళ్ళవలసియే యు౦డెను. కొంత సేపటి కొక నదీ తీరమును చేరితిమి. ఇంక కిందికి దిగవలసిన అవసరము లేదనుకొంటిని. ఈశతద్రీ నదీతీరముననే రాణాయొక్క రాజధానియైన శోహినీనగరము శోల్లు చుండెను. సంధ్యా సమయమునకు మేమచట చేరితిమి. మరునాటి ప్రాతః కాలము రాజభవనము ప్రవేశించితిని. అక్కడి వారు నన్ను ప్రప్రధమమున రాజగురువు ఆశ్రమమునకు తీసికొని పోయిరి. ఆశ్రమద్వారము చేరక పూర్వమే రాజగురువైన సుఖానంద నాధుడు వచ్చి నన్ను ఆలింగనము చేసికొని స్వాగ తమిచ్చి, 'మేడమీదికి గొంపోయి, తన చెంత కూర్చుండ బెట్టుకొనెను. ఢిల్లీలో నాకు పరిచి తుడైన సుఖానందు డిత డే, ఈయన తనగురువగు హరిహరానంద తీర్థ స్వామిలో రామమోహనుని ఉద్యానవని వనమునం దుం డెడివాడు,