పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


యీజీవనశక్తిని సంపాదించుచున్నదో అతడే ఈవృక్షమునందంతటను ఓతప్రోతముగా నివసించియున్నాడు. కాని ఆయనను మనము చూడ జాలకున్నాము. ఈగూఢాత్మ సర్వజీవుల యందును సర్వవస్తువుల యందును ఉన్నాడు. కాని ఆతడు ప్రకాశితుడగుట లేదు” *'[1]


ఇంద్రియ సముదాయము బాహ్య వస్తువులను చూచును, అంతర వస్తువులను చూడజాలదు. ఇంద్రియ సముదాయమునకు సిగ్గు చేటిది, స్వయంభు పుడగు యీశ్వరుడు ఇంద్రియములకు బహిర్ముఖముల నిచ్చియున్నాడు. కావున అవి బాహ్యవస్తువులను చూచుచున్నవి. అంతరాత్మను చూడజాలవు. కొందరు ధీరులు అమృతత్వమును పొందగోరి, ముదిత చక్షువుల సకలనస్తు వులందును అంతర్గతమైన ఒక ఆత్మను గాంచుచున్నారు. ” |[2]

ఈయుపదేశమును శ్రవణము చేసి, మననముచేసి ధిధ్యాసన చేసి బ్రహ్మయజ్ఞ భూమియగు హిమాలయ పర్వతములనుండి నేనీశ్వ రుని దర్శించితిని_చర్మచకనులతో గాదు, జ్ఞానచక్షుపులతో...నాకుపనిషత్తుల చేసిట్లు పదేశింపబడినది. "ఈశావాశ్యమిదం సర్వం” --- ఈశ్వరునిచే ఈ సకలమును ఆచ్ఛన్నము గావింపబడియున్నవి. యీశ్వరునిచే నీ సర్వమును ఆచ్ఛన్నము గామిచితిని. " ఇపుకు నేనీతిమి రాతీత ఆదిత్య వర్ణ మహాపురుషుని తెలిసికొంటిని.”[3]

ఇక మీదట నాహృదయమునుండి జ్యోతిని పృధీవియందు వ్యాపింప జేసెదను. ఏలనన నేను సూర్యుని పొందితిని. అంధ కార

మంతరించినది.”[4]

    • « ఏఎసర్వేషు భూతేషు గూఢాత్మాన ప్రకాశ తే ||
  1. 1 పరాజ్చిఖాని వ్యతృత స్వయమ్భూస్త స్మాత్ పరాన్ పర్చతి నా గ రాళ్మన్ | కశ్చిరప్రశ్య తెన నక్షత్ అపృచతుర మృశత్వమిచ్ఛన్ |
  2. # వేదాహమేతం పురుపం మహాస్త మద్యవర్ణం తమసః పరస్తాత్"
  3. "బాదజీనూర్ బాషాప్ దహుం అ గ్దిలేబాష్ |
    • బహుర్షీ ర్ రః కదేం గఁబార్' ఆఖర్ షుద్ "