పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

193

ముప్పదియారవ ప్రకరణము.


శిరము పై పోసికొను చుంటిని. అప్పుడు ఒక్క నిమిషము నాహృదయ శోణి ప్రవహించుట మాని మరుక్షణమునద్విగుణము గావింపబడిన వేగముతోప్రవహించి నాశరీరమందు సమాధిక తేజస్ఫూర్తులు సంచరింప జేయుచుం డెను. పుష్య మాఘమాసముల శీతలమునకు సహితము నేను గృహమున అగ్ని జ్వలింపచేయ నివ్వకుంటిని. శీతలమును ఎంతవరకు శరీరము సహింపగలుగునో పరీక్షించుటకును తితీక్ష, సహిష్ణుత అభ్యసించుటకును నేనీ నియమము నవలంబించుచుంటిని. రాత్రులందు నాశయ్యాగృహము తలుపులు తెరచి యుంచెడి వాడను. రాత్రి యొక్క ఆశీత వాతము నేను మిక్కిలి ప్రేమించు చుంటిని. కంబళి కప్పుకొని పక్కపై కూర్చుండి. సమస్తమును మరచి అర్ధరాత్రి పర్యంతము బ్రహ్మగీతములు, హఫీజ్' విరచిత పద్యములుపాడు చుండెడి వాడను.మేల్కొని యుండగలిగినవాడు యోగి,భోగియు రోగియు ఎక్కడ మేల్కొని యుండగలరు? బ్రహ్మజ్ఞాని,బాహ్మద్యాని, బ్రహ్మానందరసపాని బాహ్మమును ప్రేమించు వాడుఎవ్వడో అతడే మేల్కొని యుండువాడు. ” “ ఏదీపము రాత్రిని పగలుగా మార్చునోఆదీప మెవ్వరి గదిలో నున్నది?

ఆయ్యది నాహృదయమును దగ్గము గావించినది. మరి ఎవరికి అది ఆనందము నొనగూర్చినది?' *[1]

ఏరాత్రులందాతని సహవాసము నెక్కువగ ననుభవించితినో అప్పుడు మత్తుడనై అతి ఉచ్ఛస్వరము లో. * నిట్లను వాడను.

  1. «యాబ్' ఆంషమై షబ్ ఆఫ్ రోజ్ జాక'షాపై కీస్ | జూ నెమాసూఖ్ బపుర్సీద్ కాబా నా గైకీస్ II "