పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


మార్గశిర మాసము సగము సాగిన పిమ్మట నొక ప్రాతః కాలము నిద్రనుండి లేవగనే బయటకు రాగా పర్వతము పాదమును , శిఖర మువరకు మంచుతో నావరింపబడి సర్వమును శ్వేతముగా నుండుట ఉత్ఫుల్ల నేత్ర ములతో తిలకించితిని.గిరిరాజు శుభ్ర రజతవస్త్రము ధరించెను. తుషార శీతల వాయు నిశ్వాసము నేనిదే ప్రధమమున నను భవించితిని.

కాలము గడచిన కొలదియు శీతల మధికము కాజొచ్చెను. ఒక దినము కారు మేఘముల నుండి ఒడికిన దూది పింజెలవలె మంచు పడు చుండుట గాంచితిని. ఇదివరలో ఘనీభవించిన మంచుగడ్డను మాత్రము చూచియుండుటచే అదియును మంచుగడ్డవలె భారముగను కఠినముగ నుండునని భావించితిని. కాని ఇప్పుడు చూడగ నది ఉన్నివలెనే పలుచగను తేలికగ నుండెను. వస్త్రము దులిపినచో మంచు పడి పోయి వస్త్రము యధాప్రకారముగ పొడిగ నే యుండును. పుష్య మాసము నందొక దినము పొతః కాలము లేచి చూడగ రెండు మూడ డుగుల యెత్తు మంచుపడి మార్గములన్న టీని ఆటంకపరచెను. కూలీ వచ్చి ఆమంచును బద్దలకొట్టి దారి చేసిరి. అప్పుడు ప్రజలు తిరిగి నడువ సాగిరి. నేను కౌతూహలావిష్టుడనై అమంచుమీదనే నడువసాగితిని. నాప్రాతః కాల విహారము మాన లేదు. స్ఫూర్తితోను ఆనందము తోను నేనెంతయో దూరము, ఎంతయో వేగముగ నడచితిని. ఆ శీతకాల హిమమునందు నేను గ్రీష్మము ననుభవించితిని. అడుగున ధరించిన దుస్తులు చమటతో తడిసిపోయెను. ఆ కాలమునందలి నాబలమునకును ఆరోగ్యమునకును ఇది చిహ్నముగ నుండెను. ప్రతిదినము ప్రాతః కాల మునందు నేనీరీతిగా ఆనందముతో బహుదూరము భ్రమణము చేయు చుంటిని. పిమ్మట తేనీరు, క్షీరము నారగించుచుంటిని. రెండు జాముల వేళ స్నానము చేయునపుడునుంచునీళ్ళను 'నేను స్వహస్తములతో