పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.



నూప్ మలయానిలో పవన్ చమరోక రే,
సకల్ వనరాజి ఫులంతజ్యోతి|
కైసీ ఆరతి "హెూ వే భవ్ ఖండనా, తేరి ఆరతి,
అనాహతా శబ్ద బాజ ంత భేరీ |
హరిచరణ కమలమకరందలోభిత,
మనోఅను దినోమే ఆయీ పిపాసా|
కృపాజల్ దే నానక్ సారంగ్ గో యా తేహా వే
తేరీనామే వాసా. "

గగనము పళ్ళెరము. రవిచంద్రులు దీపములు.తారకామండలము ముత్యాల హారము, మలయానిలము ధూపము. పవనములు చామరములు. వన రాజము లెల్లను పుష్పములతో ప్రకాశవంతములు.భవఖండనా! ఏమిహారతి నీహారతీ! నీ భేరి మోగుచునే యున్నది, కాని ఏహస్తము దానిని వాయించుట లేదు. హరిచరణ కమల మకరందలో భితమనస్సుతో అనుదినమును వచ్చుచున్నాను. నీనామమునం దే నివసించుటకుగాను నాసక్ అను చాతకమునకు కృపాజలము ననుగ్రహింపుము. "

హారతిముగిసిన పిమ్మట ‘కడ ' (ఒక విధమైన మిఠాయి) భాగమందరకును పంచి పెట్టబడెను. మందిరములో ఈప్రకారముగా రాత్రింబగళ్ళు ఇరువది యొక్క- గంటలు ఈశ్వరోపాసన జరుగు చుండును. మిగిలిన మూడుగంటలు మాత్రము మందిరము పరిశుభ పరచుటకు ఉపాసన ఆపి వేయబడును బ్రాహ్మసమాజములో వార మునకు 'రెండుగంటలు మాత్రమే ఉపాసన జరుగును. శీఖుల హరి మందిరములో రాత్రింబగళ్ళు ఉపాసన. ఎవరైనను వ్యాకుల పాటు చెందియున్నచో నిశీధ సమయమునందు సహితమచటికిపోయి ఉపాసనచేసి చరితార్తులు కాగలరు. ఈ సద్దృష్టాంతము బహ్ములకు అను చరణీయము.,