పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది రెండన ప్రకరణము.

168


శీఖుల కప్పుడు గురువెవ్వరును లేడు. వారి గ్రంధములే వారి గురుస్థానమున ప్రతిష్టింపబడి యున్నవి. వారి యైదవగురువు గురుగో విందు. ఆతడే ఆఖరి గురువు. అతడే శీఖులలో జాతి భేదము నివార పాహాల్ ” అను పేరుతో ఇప్పటికిని ప్రచలితమైయున్నఒక దీక్షా స్వీకా రాచారము ప్రవేశ పెట్టెను. శీఖు "కాదలచినవాడు ముందు "పాహాల్" చేయ వలయును. ఆపద్దతి ఈరూపముగ నుండెను. ఒక పాత్రలో జలము నుంచి దానిలో చక్కెర వెయ్యవలెను. ఇది యొక కత్తితో కలుపబడును. ఈనీరు శీఖులు "కాదలచిన వారి గాత్రముల పైచల్ల బడును. వారందరును అప్పుడేక పొత్రమునుండి పానము చేయుదురు. బ్రహ్మక్ష్త్రియ వైశ్యశూద్రులందరు జాతి వివక్షత లేక శీఖులుకావచ్చును. మహమ్మదీయులు కూడ శీఖులు కావచ్చును. శీఖు లైన పిమ్మట వారందరు "సింగ్" లగుదురు. శీఖుల మందిరములోనేదియు ప్రతిమయుండదు. 'దాపియానాజాయ్, కీతాసాహాయ్, అపి అప్నిరంజన్ సాయ్ "అని నానక్ చెప్పియున్నాడు. ఆయన నెక్కడ స్థాపించుటకు వీలు ? ఆయన నెవరును నిర్మాణము చేయజాలరు. అతడు కేవలము ఆ స్వయుభవ నిరంజనుడు.” కాని నానక్ యొక్క యీమహోపదేశములను పొందియు శీఖులు నిరాకారబ్రాహ్మోపాసకులయ్యును, గురుద్వార ప్రాకారమునందే ఒక చోట శివాలయమును స్థాపించి యుండుట అతి విచిత్రముగానున్నది. వారికి కాళీ దేవియందుకూడ నమ్మకముకలదు. సృష్టింపబడిన ఏవస్తువును పరబ్రహ్మమని తలచి పూజింపను. "అను బాహ్మప్రతిజ్ఞనుపాలించుట ఎవ్వరికిని సులభము కాదు. వైష్ణవవసంతోత్సవ సమయమున (హోలీ) ఈ దేవాలయములో నొక గొప్ప ఉత్సవము జరుగును.ఆ సమయములో శీఖులు మద్యపాన మత్తులగుదురు. శీఖులు మద్యపానము కావింతురు, కాని చుట్ట కాల్చరు. హుక్కా గాని చిలుముగాని తాకనైనన తాకరు.

"