పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది రెండవ ప్రకరణము,

161



గురురామ్ దాస్ ఈయుత్కృష్ట సరోవరమునిక్కడతవ్వించి దీనిక మృత్సరోవరమని పేరు పెట్టెను. పూర్వమిది " చాక్ " అని పిలువబడుచుండెను.

ఆసరోవరము మధ్య ఉపద్వీపమువలె ఒక శ్వేత ప్రస్తరమందిరము కలదు. ఆమందిరమును ఒక వం తెనమీదపోయి ప్రవేశించితిని. దాని సమ్ముఖమున చిత్రవర్ణపు పట్టువస్త్రములచే నావృతమైన స్థూపాకృతిని గ్రంధములుండెను. మందిరములోని శీఖ్ ప్రధానుడొకడు దానిపై వింజామర వీచుచుఁ డెను. ఒక ప్రక్క గాయకులు పవిత్ర గ్రంధములనుండి గీతములు పాడుచుండిరి. పంజాబీ స్త్రీ పురుషులు వచ్చి మందిరమునకు ప్రదక్షిణములు చేసి పుష్పములను సమర్పించి ప్రణామములు కావించి పోవుచుండిరి. కొందరు భక్తిభావముతో గీతములు పాడుచుండిరి. ఇక్కడి కందరును ఇష్టమువచ్చినపు డెల్ల వచ్చు చు పోవుచు నుండవచ్చును. ఒకరు రమ్మనువారు లేరు. ఒకరు వల దనువారు లేరు. ఇక్కడకు క్రీస్తువులు, ముసల్మానులు అందరును రావచ్చును. ఒక్కటే నియమము. కాలిజోడుతో మాత్రమెవ్వరును ద్వారము ప్రవేశింపరాదు. గవర్నరు జనరల్ లార్డు లిట్టన్ ఈనియమము పాటింపకుండి నప్పుడు శీఖులందరును మిక్కిలి అవమానితులును, పరితాపితులునై యుండిరి.

తిరిగి నేను సంధ్యాసమయమున మందిరమునకు పోతిని.అప్పుడు హారతి జరుగుచుండెను. ఒక శీఖు పంచదీపముచేత బూని గ్రంధముల యెదుట నిలచి హారతినిచ్చుచుండెను. తక్కిన శీఖులందరు నిలబడి చేతులు జోడించి అతనితో కలసి గంభీర స్వరములతో నిట్లు పాడుచుండిరి.

“ గగన్ మే థాల్ రవిచంద్ర దీపక్ వనే,
తారకామండలీ జౌంకామోతీ!