పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదవ ప్రకరణము

151


. స్పష్ట పడ లేదు. నాయధోచిత కృత్యములు నాకు తెలియుట లేదు. ఇదియే నాదుఃఖమంతయును.*[1]

నేనిదివర కెక్కడనుంటినో, ఎచటికిపోవలెనో ఇవన్నియు నాకింకను తెలియ లేదు. ఈశ్వరజానము నేనిక్కడ నెంత పొందగలనో అంతయు పొంద లేదు, ఇక నేను లోకులతో హోహోయనుచు తిరుగను. వృధా జల్పనముతో ఇంక కాలయాపనము చేయను. ఏకాగ్రచిత్తుడనై ఏకాం తమున ఆయనకొరకు కఠోరతపస్సును కావింతును. నాగృహము విడిచిపోయెదను. ఇంక తిరిగిరాను. శ్రీశ్రీమత్ శంకరాచార్యులవారు ఇట్లు పదేశించియున్నారు. “క స్యత్వం వాకుత ఆయతః | తత్పతదిదం చింత యభ్రాతః.” “నీ వెవరివాడవు' ఎందుండి వచ్చి తివి, హేబ్రాతాత్వత్వమును చింత చేయుము.

ఈ సమయములో 1853 సం|| రం. శ్రావణమున నేను వరాహ నగరములో (Barana are) గోపాల్ లాల్ శాకూర్ ఉద్యాన గృహము లోనుంటిని. ఇక్కడ శ్రీమద్భాగవతము చదువుచుంటిని. చదువుచు చదువుచు ఈ శ్లోకములో నిమగ్నుడనై తిని: "ఆమ యశ్చభూతానాం జాయ తేయేససువత | త దేవహ్యా మయం దవ్యం నపునాతి చికిత్స తం.”— హేసువతా, ఏద్రవ్యముద్వా రా జీవులకు రోగము కలుగుచున్న దో, ఆదవ్యము ఎన్నటికిని రోగికి ఆరామము చేయజాలదు.నేనీ సంసారములో నుండుటవల్లనే యీవిపత్తులలో పడుచుంటిని. కాబట్టి యీ సంసారమునన్నీ విపత్తునుండి రక్షింప నేరదు. కావున నేనిందుండి పలాయనమవుదునుగాక, సంధ్యా సమయమున యీతో టలో గంగాతీరమున స్నేహితులతో కూర్చుండు వాడను. వర్షాకాలనీల

నీరదములు నాపై నుండి ఆకాశమున పరుగుపరుగునపోవుచుండెను. అవి

  1. * ఆయా నషుద్ కెచరా ఆమదం కుజాబూదం | దగ్దదర్ గ్గ్రాఫిల్ జర్ గీష్తనంః||,,