పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

మహర్షి దేవేంద్రనాధఠాకూర్ స్వీయచరిత్రము.


నాకప్పుడు విశేషసుఖము నిచ్చెను. అమిత శాంతి మెసంగెను, సంచారము చేయుటకు వీని కెంత స్వేచ్ఛ ! వారి యిచ్ఛానుసారముగ యిటుసటు ఎంత యథేచ్ఛగా పోవుచున్నవి! వీనివలె నాయిచ్ఛాను సారముగా యిటునటు పోవుటకు నాకు స్వేచ్ఛయుండిన నా కెంత యానం దముగా నుండును! ఛాందోగ్యోపనిషత్తులో “యఇహాత్మానమను విద్య వజం త్యేతాంశ్చసత్యాక్ కామాం స్తేషాం సర్వేషులో కేషు కామచారో భవతి” అని యుండెను. ఎవరు ఆత్మయు దానియిష్టము నెఱిగియిచట పరివ్రజనము చేయు చుందురో వారు పరకాలమున సకల లోకములం దును సంచరింతురు. సకల లోకములందును యిచ్ఛాను సారముగా సులభముగా తిరుగ గలరు.

ఇది నాకు వాంఛనీయముగా కనబడెను. ఇచ్చట నుండి పోయి స్వేచ్ఛగా సకలస్థానములందు తిరుగుదము అని నాలో నేనను కొంటిని. శ్వేతాశ్వతరోపని షద్భాష్యములో, “నధ నేన సప్రజయానకర్మణా త్యాగేనై కేనామృతత్వమాలకుః" అనియుం డెను. — దనముద్వారా కాదు, పుత్రుల ద్వారా కాదు, కర్మ ద్వారా కాదు, కేవలము ఒక్క త్యాగమునల్ల నే అమృతత్వము పొంద నగును.

అప్పుడింక యీపృధివి నామనస్సును పట్టుకొన లేక పోయెను. సంసారముయొక్క మోహబంధనము లన్నియు అప్పుడు నాకు తెగి పోయెను. అశ్వనిమాసము ఎప్పుడు వచ్చును. ఎప్పుడు ఇక్కడినుండి పారిపోదును! సర్వత స్వేచ్ఛగా సంచరింతును! మురల తిరిగి రాకుం దును! అని అప్పుడు ప్రతీక్ష చేయ నారంభించితిని. కావున ఆమాసము కొర కెదురు చూచుచుంటిని..

"సప్తమ స్వర్గము నుండి ఆహ్వాసము వచ్చినది. ఈపృధివి యొక్క మోహపాశములనే తగుల్కొనుటచే నీపని కేమి ఆటంకము

వచ్చినడో తెలియదు. * »[1]

  1. * "తురాజె కంగూరై ఆర్ష మిజనంద్ సఫీర్ | నదానమత్ కదరీ దామగః చె ఉపాదస్త్ః || "