పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

మహర్షి ఉపేంద్ర నాధశాకూర్ స్వీయచరిత్రము


తండ్రి యింటివద్దనే యుండెను. ఈఘటనలన్నిటితో నామనస్సు నితాంతము భగ్నమగు చుండెను. నేనింటి వద్దనున్న యెడల సీరూప ముగా నానాయు ప్రదవములు నన్ను చుట్టు కొనుచుండును. మరియొక సారి ఋణజాలములో బద్ధుడనగుదును. కావున నేనును గృహము పరి త్యంజిచి వెళ్ళిపోదును, ఇంక తిరిగి రాను అనుకొంటిసి. అవతల అక్ష యకుమారదత్తు ఒక సభ బయలు దేర తీసెను. అందులో ఈశ్వర స్వ రూపము చేతులు లెక్కించి నిర్ణ యించుచుండిరి. ఎట్లన: ఈశ్వరుడు ఆనంద స్వరూపుడుగదా అనిరి. ఎవరెవరికి ఆనంద స్వరూపమందు విశ్వాసముండెనో వారందరు చేతు లెత్తుదురు. ఈ రీతిగా అధికాం శల అభిప్రాయమును బట్టి ఈశ్వరుని స్వరూపముయొక్క సత్యాస త్యములు నిర్ధారిత మగు చుండెను. ఎవరు నాఅంగ స్వరూపులుగ నుండి నన్ను చుట్టుకొని యుండిరో వారిలో అనేకుల యందు ఇప్పు డిం కేధర్మ భావమును, నిష్టా భావమును కనబడకుండెను. ఒకరిబుద్ధితో ఇంకొకరి బుద్ధి, ఒకరి క్షమ, ఇంకొకరి క్షమ విరుద్ధము. ఎక్కడను మనస్సులోని మతమునకు సహాయము దొరకుట లేదు. నాకువిరక్తియు ! ఔదాస్యమును విశేషమువృద్ధి చెందుచుండెను. దీనివల్ల నాకీఈ ప్రకారము మాతము జరిగెను. ఇప్పుడు నేను ఆత్మ యొక్క గభీర తర ప్రదేశము ప్రవేశించి పరమాత్మను ఉపలబ్ధిగాంచుటకు వ్యగ్రుడనై తిని. ఆత్మ యొక్క మూలతత్వ మేమి, అను దీని అనుసంధానము నందు ప్రవృత్తుడనైతి హృదయము యొక్క ఉఛ్వాససోతమున ఏసకల సర్యములు ఈశ్వర ప్రసాదమువల్ల నా చెంతకు కొట్టుకొనివచ్చిన వానినన్నింటిని జ్ఞానాలోకనమున పరీక్ష చేయుటయందును, వాని గూ ఢార్ధములన్నిటిని ఆవిష్కరణముచేసి వానినిజీవితముల పరిణతము గావించుట యందును దృఢ ప్రయత్నములు చేయుచుంటికిని, “నేనెక్కడనుండి వచ్చితినో, ఎందులకు వచ్చితినో నాకింకయు