పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

మహర్షి దేవేంద్రనాధశాకూర్ స్వీయచరిత్రము.


పట్టుబడుట కంగీకరించితిని. మావకీల్ జార్జి యే ఘటనాక్రమమున ఆ సంవత్సరము ' షెరిఫ్ 'గానుండెను. నన్నతడు తన ఆఫీసులో కూర్చుండ నియమించి, “నేడిల్లెందుకు వదలితివి” అని ప్రశ్నించెను. ఈలోగా నాకనిష్ట సోదరుడు,జడ్జి కాల్విన్ వద్దకు వెళ్ళగా నతడు నన్ను జామీను మీద విడిపింపుమని సలహానిచ్చెను. అప్పుడు చంద్ర బాబు మొదల కారాగృహ ప్రాప్తి తప్పించిరి.


ఈసంగతి వినగానే మాపినతండ్రి ప్రసన్న కుమార్ ఠాకూర్విచారించి, “దేవేంద్రు డెప్పుడు నన్నేమియునడుగడు. ఏమియు చెప్పడు.నాకు తెలియ జేసినచో నీతని ఋణముల కన్నిటికి సులభముగ నేర్పాటుచేయ గలుగుదున” నెను. ఇది విని మరునాడతని వద్దకు వెళ్ళితిని.అతడు "నీవిం కేమియు చేయనక్కర లేదు. నీజమీందారీ రాబడియంతయు నా చేతిలో నుంచుము. ఉన్న అప్పులన్నియు నేను తీర్చి నిన్నెవ్వరు నీవిషయములో ఇబ్బంది జేయకుండ చూచెదను. ఈసలహా నేనుకృతజ్ఞతాపూర్వకముగా నంగీకరించి యప్పటినుండియు మాజమీందారీ రాబడి యావత్తును, నతని చేతిలో నుంచుచుంటిని. అతడు నాయప్పుల తీర్చు భారము వహిం చెను.అప్పటినుండియు ప్రతియుదయమును ప్రసన్నకునూర ఠాకూర్ వద్దకు పోయి పద్దులు చూపి ఋణవ్యవహారములగూర్చి ముచ్చటింప నారంభించితీని,


నేను వెళ్ళినప్పుడెల్లనన బెనర్జీ అతనిప్రక్కతెల్ల పొగాతో కూర్చుండి యుండును. కోర్టుకు “ షెరిఫ్' యెట్లో అతని దర్బారుకు నవ బెనర్జీ అట్టివాడు. ప్రతి విషయములో నాతడు నవ బెనర్జీ సహా తీసికొనుచుండును. నన బెనర్జీ యొక నాడు మాత్రము అతని విశ్వాసమునకు పాత్రుడయ్యెను. ప్రసన్నకు కుమారఠాకూమార్ యెడుట ఒక నాడు యీనవ బెనర్జీ నాతో ఇట్లనెను. తత్వబోధినీ