పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది యెనిమిదవ ప్రకరణము.


1854 వ సంవత్సరములో గిరీంద్రుడు మృతినొందెను. మాకంపెనీ వ్యవహారముల తను బహునిపుణతతో నెర వేర్చుచుండెను. కావున ఆతని మరణము వల్ల నా కార్యములుకు గొప్ప లోటుకలిగెను. ఇప్పటికనేక ఋణములు తీర్పబడెను. ఇంక ననేకములు మిగిలి యుండెను. కొందరప్పుల వాండ్రు ఆలస్యము సహించ లేక మామీద వ్యాజ్యములను వేసి ' డిక్రీలను పొందిరి.


ఈ రోజులలో నేను మధ్యాహ్న భోజనానంతరము తత్వబోధినీసభా కార్యముల చూచుట కొరకు బ్రాహ్మసమాజ గృహము రెండవ యంతస్తులో నేను కూర్చుండెడివాడను.

ఒక నాడు భోజనానంతరమునసభకు పోవుచుంటిని. “ నేడు పోవలదు. “వారంటు' (Warrant) వచ్చునట్లున్నది.”అని మాయింటిలోని వారు నాతోనసిరి. ఇది అనవసర భయమని తలంచి, ఇది వినికూడా సభకుపోయి పని చూచుకొన నారంభించితిని.

కొంత సేపటి కొక బంగాళీ గుమాస్తా ముఖము నెఱ్ఱ చేసుకొనివచ్చి నాతో మెల్లగా నిట్లనెను. “ఇక్కడకు రావలదని నేను కబురుపంపితినే.మీరేలవచ్చితిరి?” అని అడిగెను. అటుపిమ్మట ' బైలిఫ్ కి నన్ను వేలుపెట్టి చూపి " ఈయన యే దేవేంద్రనాధ ఠాకూర్ ” అని చెప్పెను.అప్పుడు “వారంటు'చూపి, వెంటనే 14,000 రూపాయలు చెల్లింపవలెనని చెప్పెను. నావద్ద యిప్పుడు 14,000 రూపాయలు లేవంటిని, అట్లయిన చో వెంటనే నాతో ' షెరీఫ్ ' వద్దకు రమ్మనెను. అతనిని కొంచము తాళుమని చెప్పి బండికి కబురు పంపితిని, అది వచ్చిన పిమ్మట ఆబైలిఫ్ దొర నన్నందులో నెక్కించి ' షెరీఫ్ 'వద్దకు కొనిపోయెను.


నన్ను వారంటు చేసి పట్టుకొనిరని అవతల మాయింట పెద్దగోల. 'నేడందరు నన్నిల్లు కదలవలదని చెప్పిరి. కానీ నేను“వారంటు' పైన