పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది యెనిమిదవ ప్రకరణము.

145

పత్రిక బహుమంచిది. బాబు లైబ్రరీలో నేను చదువుచుందును. అదిచదివినచో జ్ఞానము, చైతన్యము వచ్చును.దానినుండి జ్ఞానము పొందనగును.” నేను, “నీవు తత్వబోధినీతిపత్రిక చదువుదువా? చదువకు, చదువకు "అంటిని. ప్రసన్నకుమారఠాకూర్ , “ఏమి, చదివిన నేమి?” అని యడిగెను. “తత్వబోధినీ పత్రిక చదివిన యెడల నాకుపట్టిన దశయేపట్టును.” అంటిని. అతడు “ఆ! దేవేంద్రుడు నిజము ఒప్పుకొనెను. ఒప్పుకొంటివిగదా? ” అని పెద్దనవ్వు నవ్వనారంభించెను. సరే, దేవుడున్నాడని నాకు రుజువు చెయ్యగలవా?” అనెను. “ఆగోడ అక్కడనున్నదని రుజువు చెయ్యగలవా?” అని ప్రత్యుత్తరమిచ్చితిని. అతడు నవ్వి “అరే, ఆగోడ అచట నేయున్నది. నేను చూచుచున్నాను. ఇందులో ఇంక రుజువు చేయుట కేమున్నది,” అనెను. నేను, “ఈశ్వరుడు సర్వత్ర ఉన్నాడు. నేను చూచుచునే యున్నారు. ఇందులో ఇంక రుజువు చేయుట కేమున్నది?” అంటిని. “ఓహో! దేవుడు, గోడ సమానమైనట్లు! ఏమి చెప్పుచున్నాడు దేవేంద్రుడు?" అని అతడనెను. నేను, “ఈశ్వరుడు నాకు గోడకన్న సమీపముననున్నాడు. ఆతడు నాఅంతరమునందున్నాడు. నాఆత్మలో నున్నాడు. ఈశ్వరుని ఎవరు మన్నింపరో వారిని శాస్త్రములు నిందించును. " అసత్యస్తే ప్రతిష్ఠన్తేజగదాహురనీశ్వరం.” అసురులు అసత్యమునవలంబించి ఈ జగత్తులో ఈశ్వరుడు లేడని చెప్పుచుందురు అని చెప్పితిని, అతడు “కాని శాస్త్రములలో నే నన్నిటికటె నీమాట నెక్కువ మన్నింతును. "అహం దేవోన చాన్యాస్మి నిత్యముక్తస్య భావవాన్” - “నేను నిత్యముక్త స్వభావవంతుడగు పరమేశ్వరుడను. నేనింతకన్న నేమియు కాను.” -

నేను ధనవంతుడను. బహులోకులకు ప్రభువును. నాకు సమానులింకెవరున్నారు, [1]అన్న అభిమానముండినచో కొంత సమంజసముగా

  1. “ఆధ్యోహం జవణానసికోన్మోస్తి సదృశోమయా.” 19