పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


కేకలు వేసిరి. నేనుకొంచము పర ధ్యానముగానుండుటచే నాజన తరంగములో పడిపోతిని. నామిత్రులెట్లో నన్ను పట్టుకొని సురక్షితముగా మాత్రముంచిరి. కాని నాసులోచనములు మాత్రము క్రింద పడిపోయి బద్దలయ్యెను. జగన్నాధ విగ్రహము స్పష్టముగా చూచుటకునాకు తరుణము దొరక లేదు. కానీ నిరాకార జగన్నాధుని మాత్రము చూచితిని. ఈ దేవాలయములో నేవరేది చూడవలెనని కోరుకొన్న నది చూడగలరని యొక వాడుక కలదు. నావిషయములో మాత్రమది నిజమయ్యెను.


ఈసంకీర్ణాంధకార నిర్వాత మందిర మధ్యమున అసంఖ్యాకులగు స్త్రీ పురుష యాత్రికులుండిరి. స్త్రీలు వారి మాసమును కాపాడుకొనుట కసాధ్యముగనుండెను. ఆ సమూహ తరంగములోబడి ఒక సారియిక్కడకు ఒకసారి అక్కడకు విసరి వేయబడుచుంటిని. ఒక క్షణమైననుస్థిరముగా నొక స్థలములో నుండుట కసాధ్యముగా నుండెను. నావద్దసున్న జమాదారును పండాలును చేతులులంకె వేసికొని మూడువైపులనా వెనుక నడ్డునిలబడిరి. సమ్ముఖమున జగన్నాధుని రత్న 'వేది యేనాకుకాపుదలగా నుండెను. అప్పుడు నేను స్వేచ్ఛగా నంతయు చూడగలిగి తిని. జగన్నాధునిముందు నీటితో " ముంపబడిన యొక రాగిబిందే యుండెను. అందులో జగన్నాధుని ఛాయ పడియుండెను. ఈ ఛాయావిగ్ర హముయొక్క పండ్లుతోమి దానిపై తిరిగి నీరుపోసిరి. దానితో జగన్నాధుని దంత ధావనము, స్నానము అయిపోయెను. పండా లప్పుడు ఆజగన్నాధుని పై కెక్కి నూతన వస్త్రములతోను నూతనాభరణముల తోను విగ్రహము నలంక రించిరి. అప్పటికి పదునుకండుగంటలు దాటెను.అప్పుడు మహానై వేద్యమునకు సమయమైనది. నేనక్కడ నుండి మరలి వచ్చితిని.


అక్కడనుండి విమలా దేవి మందిరమునకు పోతిని, ఇక్కడప్ర