పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియేడవప్రకరణము,

141


జలు బహుకొలది మంది మాత్రముండిరి. "నేను విమలా దేవికి ప్రణామము చేయకుండుట ప్రతివారును చూచిరి. ఓడ్రులకు మిక్కిలి కోపము వచ్చెను. “ఎవరది? ప్రణామము చేయకున్నాడు! ” అనుచు నన్ను భయ పెట్టుచు నన్ను చుట్టుకొన నారంభించిరి. సంగతి గని పెట్టి నాపండా నన్ను నానిర్దిష్ట వాసస్థానమునకు కొనివచ్చెను. అతడక్కడ నాతో “విమలా దేవికి ప్రణామము చేయకుండుట బాగుండ లేదు. యాత్రి కులు మిక్కిలి అసంతుష్టి చెందిరి, ఒక సారి సాష్టాంగ పడుటయేకదా! మీరది చేసిన తీరిపోను.” అనెను.


నేనతనితో విమలా దేవికి ప్రణామము చేతునా ఏమి ?మాయాదేవికే నేను నమస్కరించ లేదు! నీ వెఱుగుదువా? నేను మాయపురికి పోయియుంటిని. మాయామందిరమునకు వెళ్ళి యామెను చూచితిని. *[1] ఆమె మణిమండిత పర్యంకముపై అర్ధశయసయై యుండెను. నేను వచ్చిన దామె లెక్క చేసినట్లు కనబడ లేదు. ఆమె సహచారిణి యొకతె ప్రణామము చేయమని నాకు సంజ్ఞ చేసెను, సృజింపబడిన యే దేవతకుగాని దేవికి గాని నేను ప్రణమిల్ల నంటిని. అందుకు వారు కోపముతో నాలుకలుకరచికొనిరి. మాయాదేవి వారితో అతడు నమస్కరింపక పోయినచో నొకపుష్పమైన యివ్వనిండు అనెను. 'నేను దీని కేమియు ప్రత్యుత్త రమియ్యక ఆమెగదినుండి బయటికి వచ్చితిని. కింది అంతస్థుకుదిగి బయటకు పోవుటకు ముదు వసారాకు వచ్చితిని. కాని నేను ముందడుగిడు సరి కింకొకవసారాకనబడెను. దానిముందుకు వచ్చుసరికి మరియొకటి కనబడెను, ఈవిధముగా నే నెన్నివసారాలు దాటినను ముందు ఇంకను అన్ని వసారాలుండెను. ఎన్నెన్నో వసారాలు దాటితీని. కాని వానికంతము లేకపోయెను. అప్పుడు


  • « తన్వీశ్వామా శిఖరదళజా " -- ఆను కోమల గాత్రి, సుకుమారి; తెల్లని స్వ చ్ఛము లౌ దంతమలగలది. —-